అడ్వెయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా కలాం సలహాదారి వి.పొన్ రాజ్ జనసేన పార్టీలోకి కొత్తగా నియమితులయ్యారు.

మాజీ రాష్ట్రపతి అబ్దులాం కలాం సలహాదారు వి.పొన్‌రాజ్ జనసేన అడ్వైయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులయ్యారు.

పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు.పొన్ రాజ్ గతంలో కలాం విజన్ ఇండియా పార్టీని ఏర్పాటు చేశారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం శాస్త్రీయ సలహాదారు వి.పొన్ను రాజ్‌ను జనసేన పార్టీఅడ్వెయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా పవన్ కళ్యాణ్నియమించారు.

కలాం సలహాదారుగా పనిచేసిన పొన్ను రాజ్ తన అభ్యర్థనను మన్నించడం పట్ల పవన్ సంతోషం వ్యక్తం చేశారు.

ఆయన విలువైన సలహాలు ప్రజల జీవితాలను మారుస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొన్ను రాజ్ మాట్లాడుతూ.. పవన్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఏపీ పట్ల పవన్ విజన్ తనను ముగ్ధుడ్ని చేసిందన్నారు. సుస్థిర అభివృద్ధి కోసం పవన్ తపన ఆకట్టుకుందన్నారు. తమిళనాడుకు చెందిన పొన్ను రాజ్ రక్షణ రంగ శాస్త్రవేత్త. టెక్నాలజీ ఇంటర్‌ఫేస్ డైరెక్టర్‌గా ఆయన పని చేశారు.

కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయనకు శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు.

కలాం తన రోల్‌మోడల్ అని చెప్పే పొన్ను రాజ్ ఆయన దగ్గరే పీహెచ్‌డీ చేశారు. 20 ఏళ్లపాటు కలాంతో కలిసి ప్రయాణించారు. రాష్ట్రపతి భవన్‌లో ఐదు మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ బాధ్యతలను కలాం పొన్ను రాజ్‌కు అప్పగించారు.

2016 ఫిబ్రవరిలో అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ (వీఐపీ)ని ఆయన స్థాపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *