తోక కత్తిరిస్తామని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఉంటకిస్తూ….. మీ తల కత్తిరిస్తారు జాగ్రత్త అంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

‘జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్డు మీదకు వచ్చి నిలబడితే ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది’

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆయన పేరు చెబితే టీడీపీ అసలు ఓట్లే పడవని, ఆయనో పెద్ద ఫిరాయింపుదారుడని మండిపడ్డారు.

గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఎపిసోడ్‌తో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు.

విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ వల్ల తనకు ఒరింగిదేమీ లేదన్నారు.. తనకు, వల్లభనేని వంశీకి కూడా రాజకీయ భిక్ష పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ అని మంత్రి కొడాలి స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే.. దానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే కారణమని, లోకేష్ లాంటి దద్దమ్మ వల్లే టీడీపీ నాశనం అవుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు పేరు చెబితే టీడీపీకి ఓట్లు పడవని, జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్డు మీదకు వచ్చి నిలబడితే ఆయన సత్తా ఎంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. జగన్‌ డిక్లరేషను ఇచ్చి వెళ్లడానికి తిరుమల ఏమన్నా.. చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడిదా? అని మాత్రమే అన్నానని, శ్రీవారి కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి వివరణ ఇచ్చారు.

సీఎం జగన్ తిరుమలను సందర్శించడం ఇదేం తొలిసారి కాదని, గతంలో పాదయాత్ర సమయంలోనూ శ్రీవారిని దర్శించుకున్నారని అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని కొడాలి నాని గుర్తు చేశారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా బ్రహ్మోత్సవాలకు చాలాసార్లు పట్టు వస్త్రాలు సమర్పించారని, ఇలా అనేక సార్లు వైఎస్ కుటుంబం తిరుపతికి వెళ్లడం ఆనవాయితీగా జరుగుతోందన్నారు. అప్పుడు లేని సెల్ఫ్ డిక్లరేషన్ అంశం.. ఇప్పుడెందుకు వచ్చిందని చంద్రబాబును ప్రశ్నించారు.

టీడీపీ కావాలనే మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కొడాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు పెద్ద ఫిరాయింపుదారుడని, పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తప్పిస్తారా? అని కొడాలి నిలదీశారు. తోక కత్తిరిస్తామని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఉంటకిస్తూ….. మీ తల కత్తిరిస్తారు జాగ్రత్త అంటూ నాని హెచ్చరించారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్, గుడివాడలో తాను పార్టీ కోసం పనిచేస్తామని, సీఎం జగన్‌ నిర్ణయం తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు.

మంత్రి నాని మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ కొద్దిసేపు అక్కడే నిలబడి వెళ్లిపోయారు. వారి మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed