చంద్రబాబును ఎన్నికల్లో పోటీ చేయను ఇవ్వద్దు: జెరుసలెం మత్తయ్య

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నమోదైన ఓటుకు నోటు కేసులో తనకు అనవసరంగా దించారని ఆరోపణలు ఎదుర్కొన్న జెరూసలెం మత్తయ్య వెల్లడించారు. హైకోర్టు తాను నిర్దోషిగా ప్రకటించింది అని చెప్పారు.

ప్రధానాంశాలు:
2015 నుంచి విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ చెయ్యని వద్దని డిమాండ్ చేస్తూ హైకోర్టు నిర్దోషినని తీర్పు వెల్లడించింది అన్న మత్తయ్య.

దళిత క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని తమ వర్గాన్ని అవమానిస్తున్నారని ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మత్తయ్య ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తమ ఓట్లను తెలుగు ఇస్తుంటే ప్రతిపక్ష వైసిపి మాత్రం ప్రశ్నించడం లేదన్నారు.

తనను ఓటుకు కోట్లు కేసులో బలవంతంగా తెరిపించారని తెలిపారు మత్తయ్య. కానీ తనలో నిర్దోషిగా హైకోర్టు ప్రకటించిందని గుర్తు చేశారు.అయితే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రయోజనం దక్కలేదన్నారు.

మద్దయ్య శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఓటు కు నోటు, ఏసీబీ కేసులో పట్టుబడ్డ సెబాస్టియన్, రేవంత్ రెడ్డి ల తో ఏపీ సీఎం చంద్రబాబు కోర్టును ఆశ్రయించి తన లాగ నిర్దోషిత్వం నిరూపించుకోవాలని సూచించారు.

ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు లాంటి వ్యక్తులను ఎన్నికల్లో పాల్గొనకుండా చేయాలని డిమాండ్ చేశారు మత్తయ్య. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రలోభాలకు గురిచేశారని మత్తయ్య ఆరోపించారు. వచ్చే ఎన్నికలకు ముందుగానే విచారణ జరిపి దోషులను శిక్షించాలని అవసరం ఎంతో ఉందన్నారు.

ఉదయ్ సింహ, రేవంత్ రెడ్డి ఎవరు తనకు శత్రువులు కాదని, ఓటుకు నోటు లాంటి వ్యవస్థను రక్షణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

తాను నిర్దోషినని హైకోర్టు తీర్పు ఇచ్చిన రాజకీయంగా తనకు న్యాయం జరగలేదని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబీఐ, ఎన్ఐఏ లతో ఓటుకు నోటు కేసుపై విచారణ జరిపించాలని ఫిబ్రవరి 11న ఢిల్లీలోని ఏపీ భవన్లో నిరసన దీక్షను చేపట్టనున్నట్లు మత్తయ్య తెలిపారు.

దీక్షకు క్రిస్టియన్ సంఘాలు కూడా మద్దతు తెలపాలని కోరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed