జగన్ చెంతకు కు చేరుకున్న సినీనటి …మళ్లీ రాజకీయ బాటలో జయసుధ

గతంలో సినీనటి జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రోద్బలంతో జయసుధ రాజకీయాల్లోకి రావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలవడం అన్ని చకచకా జరిగిపోయాయి.
అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన జయసుధ, ఒకానొక దశలో వైఎస్ జగన్‌కి మద్దతుగా నిలిచినా, వెంటనే మాట మార్చి కాంగ్రెస్‌లో కి చేరారు.
2014 ఎన్నికల తర్వాత రాజకీయంగా కొంత ‘మౌనం’ గా ఉన్నారు జయసుధ, తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరడం అయితే జరిగిందిగానీ, ఏనాడూ ఆమె టీడీపీ నేతగా వ్యవహరించిన దాఖలాల్లేవు.
పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా జయసుధ జాడ కన్పించలేదు. మళ్ళీ ఎన్నికల ముందర జయసుధ, రాజకీయంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.
రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా.? లేదో…తేలియదు.ప్రస్తుతానికి మాత్రం సస్పెన్సే. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో గత కొద్ది రోజులుగా టచ్‌లో వున్నరు జయసుధ.
వైఎస్ జగన్ నుంచి సానుకూల స్పందన రావడంతో, జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరబోతున్నారట.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికే జయసుధ పరిమితమవుతారనే ప్రచారం జరుగుతున్నా.. జయసుధ సన్నిహితులు మాత్రం, జయసుధకి సినీ నటిగా వున్న పాపులారిటీ నేపథ్యంలో తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు నిండుగా ఉన్నాయి.