జయలలితకు శశికళ హల్వా తినిపించి చంపేశారని ఆరోపించారు: మంత్రి షణ్ముగం

జయలలితకు హల్వా తినిపించి చంపేశారని తమిళనాడు మంత్రి షణ్ముగం సంచలనం ఆరోపణలు చేశారు.

అమ్మ షుగర్ వ్యాధి ముదిరి చనిపోవాలన్నదురుద్దేశంతోనే శశికళ ఇలా చేసిందన్నారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత లోకం విడిచి రెండేళ్లు దాటినా ఆమె మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

తమిళ రాజకీయాలు ఇప్పటికీ ఆమె మరణం చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జయలలితకు హల్వా తినిపించి చంపేశారని షణ్ముగం సంచలనం ఆరోపణలు చేశారు.

విళుపురం జిల్లా కళ్లకురిచ్చిలో మంత్రి మాట్లాడుతూ.. జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెను చూసేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.

శశికళ ఎప్పుడూ మమ్మల్ని అనుమతించలేదు. జయలలితకు షుగర్ వ్యాధి ఉందని తెలిసి కూడా ఆస్పత్రిలో ఆమెకు హల్వా తినిపించారు.

అమ్మకు వ్యాధి ముదిరి సహజంగా చనిపోవాలన్న దురుద్దేశంతోనే శశికళ ఇలా చేసింది. కోలుకుంటున్న సమయంలో జయలలితకు కార్డియాక్ అరెస్ట్ ఎలా వస్తుంది?. ఒకవేళ వస్తే ఆస్పత్రి బాల్కనీలో రక్తం ఎలా చిందింది?. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది?. సరైన పద్ధతిలో శశికళను విచారిస్తే అమ్మ మృతిపై నిజాలన్నీ వెలుగులోకి వస్తాయి’ అని మంత్రి అన్నారు. రెండాకుల గుర్తును నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వారి కలలు ఫలించవంటూ టీటీవీ దినకరన్‌ను ఉద్దేశించి షణ్ముగం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *