అనూహ్యం.. సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు..

జనసేనాని పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడూ విరుచుకుపడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో
ఆరంభించడం అభినందనీయం. అలాగే, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం.’’ అని పవన్ ప్రశంసలు కురిపించారు.
‘‘ఇది ప్రపంచానికే గడ్డు కాలం.. అందుకే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సహకరిద్దాం. క్షేమంగా ఉందాం’’ అంటూ ప్రజలకు జనసేని పిలుపునిచ్చారు.