ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి? టీడీపీ జనసేన దగ్గర అవుతున్నాయా?

రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే టీడీపీ జనసేన దగ్గరవుతున్నాయి అనిపిస్తుంది. గత ఎన్నికల్లో కలిసి ఆ తరువాత విడిపోయి, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్న అంటూ ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఒకప్పటి మిత్ర పార్టీలు టిడిపి , జనసేన మధ్య బంధం మరోసారి బలపడుతున్న గట్టి ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కలిసి పని చేసిన తర్వాత ఇటు టిడిపిని అటు ప్రభుత్వాన్ని విభేదిస్తూ బయటికి వచ్చారు పవన్, టిడీపి కూడా పవన్ ని విమర్శిస్తూ వచ్చింది. బిజెపి చెప్పినట్టు పవన్ వ్యవహరిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శించారు. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ సమీకరణలు మారుతున్నాయి, ఇటీవల రెండు పార్టీలు మధ్య పరిస్థితి మారింది. ఇద్దరు నాయకుల స్వరాల్లో తేడాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ ను చేస్తున్న కొన్ని ఆసక్తికర కామెంట్స్ టిడిపి జనసేన మధ్య స్నేహాన్ని గుర్తు చేస్తున్నాయి. ఓ పక్క రెండు పార్టీలు మరోసారి కలవబోతున్న ట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టిడిపి కి పవన్ మద్దతు ఇచ్చినట్టుగా , వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తానంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి తోడు ఇద్దరి నేతల కామెంట్స్ ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి.

ఓ మీడియా సమావేశంలో పవన్ పై చంద్రబాబు చేసిన ఆసక్తికర కామెంట్స్ వీరిద్దరి బంధం పై ప్రచారానికి తెర తీసింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసాము. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాను, ప్రతిపక్ష పార్టీకి ఏంటి బాధ? అంటూ చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు. కేంద్రంపై పోరాటానికి పవన్ మాతో కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు చంద్రబాబు వ్యాఖ్యల్ని పవన్ నామమాత్రంగానే ఖండించారు గాని అనుకునే అంత స్థాయిలో తిప్పి కొట్టలేదు అనే భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మొదట్లో టిడిపి నీ గట్టిగా విమర్శించే పవన్ ఇటీవల వైసీపీ నీ టార్గెట్ చేశారు, చంద్రబాబు కి అనుకూలంగా జగన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు పవన్. చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఇటీవల పవన్ కి సన్నిహితంగా ఉంటున్నారు.

వారే రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిర్చారు అంటున్నారు. వైసీపీ నేతలు మొత్తానికి టీడీపీ జనసేన మైసూర్ పై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు ప్రాణం పోస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే ఎన్నికల షెడ్యూలు వచ్చేదాకా వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *