ఇచ్చాపురం లో జరిగిన బహిరంగ సభకు హాజరైన జనం జనం కు జగన్ ఇచ్చిన హామీలు

మూడు నెలల్లో రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరూ నాకు తోడుగా రావాలి. మీ దీవెనలు ఇవ్వాలి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీ, విశ్వాసనీయత తీసుకురావడానికి మీ బిడ్డగా బయల్దేరా. ఆశీర్వదించండి అని జగన్ కోరారు.
జగన్ ఇచ్చిన హామీలు:
- వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తు
- రైతులకు బ్యాంకుల నుంచి వడ్డీ లేని పంట రుణాలు
- ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12, 500 చొప్పున సాగుకు పెట్టుబడి.
- ఉచిత వ్యవసాయ బోర్లు.
- పంటల భీమా ప్రీమియం సొమ్ము మొత్తం రైతులు తరుపున చెల్లింపు.
- ఆక్వాకు రూపాయి నడకే యూనిట్ విద్యుత్.
- రూ.3 వేల కోటుతో ధరల స్థిరీకరణ నిధి.
- సాగుకు ముందే పంటల కొనుగోలు ధరలు వెల్లడి
- ప్రతి మండలంలో శీతలీకరణ గదులు, అవసరమైన చోట వాటికి అనుబంధంగా ఆహారశుద్ధి పరిశ్రమల .
- హకార రంగంలో జిల్లాకు పాలు డైరీ రైతులకు లీటర్ కు నాలుగు రూపాయలు బోనస్.
- ఆత్మహత్య చేసుకున్న ఒక్కొక్క రైతు కుటుంబానికి వైఎస్ఆర బీమా కింద ఐదు లక్షలు వెంటనే చెల్లింపు. ఆ సొమ్ము పై బాధిత రైతు భార్యకే హక్కు ఉండేలి తొలి అసెంబ్లీ సమావేశం లోనే ప్రత్యేక చట్టం.
- రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాలు నిది.
- తిత్లీలో పడిపోయిన ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ. 3000. హెక్టారు జీడిమామిడికి రూ.50వేలు.
- జిల్లాలు 25
- ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లాగా ఏర్పాటు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలో 25కు పెంపు. కలెక్టర్లు వ్యవస్థ, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం.
- ప్రతిగా గ్రామ పంచాయతీ లోను గ్రామ సచివాలయం ఏర్పాటు. అదే పంచాయతీకి చెందిన పది మందికి అక్కడ ఉద్యోగాలు.
- ప్రతి గ్రామంలోనూ 50 ఏఇళ్లకో వలంటీరు. రూ.5వేల చొప్పున వారికి గౌరవ వేతనం.