చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు

వ్యవస్థలన్నింటినీ బ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు ఏపీలో ప్రభుత్వం చేపట్టిన సర్వే పేరుతో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షనేత వైయస్ జగన్ ఆరోపించారు.ఈ రోజు ఆయన హైదరాబాదులోని రాజ్ భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు.
ప్రధానాంశాలు:
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓటర్ల జాబితా అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ బ్రష్టు పట్టిస్తున్నారని ఫిర్యాదుతో పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా చంద్రబాబు వల్లే రాలేదని జగన్ మీడియాతో స్పందించారు. సర్వే జరుగుతున్న నేపథ్యంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని జగన్ గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.
శనివారం రాజ్ భవన్ కు వెళ్లిన జగన్ గవర్నర్ నరసింహన్తో సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఏపీలో పోలీసు అధికారల బదిలీల్లో జరుగుతున్న అక్రమాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల పైన ఆయన గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం.
డిజిపి ఆర్పీ ఠాకూర్, ఇంటిలిజెన్స్ ఐజి తీరుపై సిఈసికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ బ్రష్టు పట్టించడమే తన పనిగా ఆరోపించారు .
రాజకీయ స్వార్థం కోసం పోలీసులు ఎలా ఉపయోగించుకున్నారో గవర్నర్కు వైయస్ జగన్ వివరించారు.సర్వేల పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో డేటా సేకరించి ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఉన్నవారికి ఓట్ల జాబితా నుంచి తొలగిస్తుందని గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు.
డిజిపి, ఇంటిలిజెన్స్ ఐజి అధికార పార్టీకి మద్దతు పలుకుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించే లా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు.
ఓ వ్యక్తిని మరొకరిని కత్తితో పొడిచి తిరిగి ఆ హత్యకు నిరసనగా దీక్ష ఎలా ఉంటుందో చంద్రబాబు దీక్ష అలాగే ఉందని జగన్ హేళన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణమని ఆరోపించారు.
హోదా సంజీవని కాదని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరును ఎవరు మర్చిపోలేదని స్పందించారు.హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభలో ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభలో తీర్మానం చేసింది చంద్రబాబు? అని ప్రశ్నించారు.
నాలుగేళ్ల బీజేపీ తో సంసారం చేసిన సమయంలో హోదా గురించి మాట్లాడని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న దృశ్యం దొంగ దీక్షలు చేపడుతున్నారని జగన్ మండిపడ్డారు.
నాని ప్రశంసించారు. వైఎస్సార్ పథకాలు వల్ల లబ్ది పొందిన ప్రజలంతా ఇప్పటికీ ఆయనిదేవుళ్ళ ఆదరిస్తున్నారని తెలిపారు. పేదవాడికి గూడు కట్టించి, ఉచిత విద్యుత్తు అందించారు.
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, ఐదు సంవత్సరాల మూడు నెలల పాటు దిగ్విజయంగా పాలన చేశారు. యాత్ర చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి విజయవంతం చేయాలని నాని ఈ సందర్భంగా కోరారు.