పేదలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. బియ్యం వద్దంటే డబ్బు, వివరాలివే!

రైస్ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన సోర్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తారు. మిగిలిన నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో పేదలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 1 నుంచి బియ్యాన్ని డోర్ డెలివరీ చేయనుంది.
రైస్ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన సోర్టెక్స్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తారు.
ఈ బియ్యం సరఫరాకు గాను ప్రభుత్వం రీయూజబుల్ సంచులను పంపిణీ చేయనుంది. క్వాలిటీ బియ్యం డోర్ డెలివరీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
డెలివరీ వాహనాలకు సంబంధించి.. మంత్రి మండలి నిర్ణయం మేరకు స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మరియు ఈబీసీ యువతకు అవకాశం ఇవ్వనున్నారు.
వాహనాలు కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ ని సర్కార్ అందించనుంది.కేవలం పది శాతం చెల్లించి వారు వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇక లోన్ తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హామీ ఇచ్చేట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరేళ్లు లోన్, తర్వాత లబ్దిదారుల పేరుతోనే వాహనం రిజిస్టర్ అవుతుంది.
అంతేకాదు ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ప్రభుత్వం విరమించుకున్న నగదు బదిలీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఎవరైనా లబ్ధిదారు బియ్యం వద్దు అనుకుంటే బదులుగా నగదు ఇవ్వాలని భావిస్తోందట.
ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్స్‌పై ప్రభుత్వం ఆలోచన చేస్తోందంట. త్వరలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిలో బియ్యానికి రూ.25 నుంచి రూ.30 ఇచ్చే అవకాశం ఉందట.