జగన్ పుట్టినరోజు ప్రజలు ఒక పండుగలా చేసుకుంటున్నారు

అనకాపల్లి: శుక్రవారం స్థానిక అనకాపల్లి రింగ్ రోడ్డు వద్ద వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని అమర్నాథ్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు మండపాటి జానకీరామరాజు (జాని) కి కేకు తినిపించి జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరాలంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందని వైయస్సార్ సిపి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ అన్నారు ప్రస్తుత రాష్ట్ర అధికార తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న మహోన్నత వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని అన్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలైన ప్రత్యేక హోదా , రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు , కడప స్టీల్ ప్లాంట్ వంటి తదితర హామీలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు.. గత ఏడాది ప్రజాసంకల్పయాత్ర ను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే ప్రజల సమస్యలను జగన్మోహన్ రెడ్డి పరిష్కరిస్తారని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా పండగ వాతావరణం వల్లే జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు.

వచ్చే ఏడాది ముఖ్యమంత్రిగా జగన్మోహరెడ్డి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, పార్టీ నాయకులు కొణతాల మురళీకృష్ణ , గొర్లి సూరి బాబు , జాజుల రమేష్, ఏవీ రత్న కుమారి , కుండల రామకృష్ణ, గైపూరి రాజు పాల్గొన్నారు…