నాదెండ్ల ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాన్‌కు వెన్నపోటు పొడుస్తాడా?

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ (అయన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు)..కూడా పవన్ కళ్యాన్‌కు వెన్నపోటు పొడుస్తాడా?

ఇప్పుడు ఇదే సందేహం అందరిలో ఉంది..ఎందుకంటే గతంలో సినీ ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నందమూరి తారకరామారావు..సొంతంగా తెలుగుదేశం పార్టీ ని స్థాపించి , ఊరు, వాడ తిరుగుతూ తన ప్రసంగాలతో జనాల్లో కొత్త స్ఫూర్తిని నింపారు..పార్టీ సిద్ధాంతాలను , సంక్షేమ పథకాలను తెలుపుతూ 9 నెలల్లో అధికారం చేపట్టారు.

అదే టైం లో రాజకీయాల్లో ఉన్న నాదెండ్ల భాస్కర్ తెలుగుదేశం పార్టీ లో ఉంటూ ఎన్టీఆర్ కు అడ్మినిస్ట్రేషన్ తెలియదని , అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకుంటానని చెప్పి చివరకు ఆయనకే వెన్నుపోటు పొడిచిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఆ తర్వాత ఎన్టీఆర్ ను గద్దె దింపడం , ఆయన సీఎం కావడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి..

ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ కుమారుడు..నాదెండ్ల మనోహర్ కూడా అదే వ్యూహంతో ఉన్నాడా..ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో నాదెండ్ల మనోహర్ చేరిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పవన్ వెంట మనోహర్ ఉంటూ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు పెద్దగా రాజకీయ అనుభవం లేదు.

ఈ నేపథ్యం లో ఆయన కు రాజకీయ సలహాలు , సూచనలు ఇస్తూ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి.

ఎక్కడెక్కడ ఎలాంటి అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రత్యర్థులను ఎలా ఎదురించాలి.

ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలి.

మొదలగు రాజకీయ సలహాలు ఇస్తూ పవన్ కల్యాణ్ తో అడుగులు వేస్తున్నారు..

నాదెండ్ల మనోహర్ పవన్ వెంట ఉంటున్న తీరు.ఆయన సాన్నిహిత్యం..ఇవన్నీ చూస్తున్న చాలామందికి నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు గుర్తుకు రావడం ఖాయం.

తండ్రి మాదిరిగానే కొడుకు కూడా అలాగే చేస్తాడా..సినీ తారలను రాజకీయ తారలుగా ఎదగనీయరా..అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ సైతం తన ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్‌కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తారేమో అంటూ సందేహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు.. అప్పటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాన్‌కు వెన్నపోటు పొడవకుండా ఉండాల్సిందిగా తాను తిరుపతి బాలాజీని వేడుకుంటున్నానంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

మరి మనోహర్ తండ్రిలాగా వెన్నుపోటు పొడుస్తాడా..లేదా అనేది… రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *