ఫారం-7 దరఖాస్తు పంపిన గుర్తు తెలియని వ్యక్తులు…

ఫారం-7 వివాదం.. ఎమ్మెల్యే ఓటు తొలగింపునకు దరఖాస్తు పూతలపట్టు ఎమ్మెల్యే ఓటు తొలగించాలంటూ ఆన్‌లైన్ ద్వారా ఫారం-7 దరఖాస్తు పంపిన గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో 4వేల ఓట్లు తొలగించారని ఆరోపణ.

ఏపీలో సంచనలంగా మారిన ఫారం-7 వ్యవహారం.
చిత్తూరు జిల్లాలో ఏకంగా లక్షా 10వేల దరఖాస్తులు.
టీడీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపణ.

ఏపీలో ఫారం-7 వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఓట్ల తొలగించాలంటూ ఎన్నికల సంఘానికి కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు రావడం కలకలం రేపుతోంది.

చిత్తూరు జిల్లాలో ఫారం-7 దరఖాస్తులు ఏకంగా లక్షా 10వేలకు చేరాయి.

అంతేకాదు ఏకంగా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఓటును తొలగించాలంటూ ఆన్‌లైన్ దరఖాస్తు రావడం సంచలనంగా మారింది.

తన ఓటును తొలగించాలంటూ ఫారం-7 దరఖాస్తు రావడంతో ఎమ్మెల్యే షాక్ తిన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల ఎం.పైపల్లిలో తనకు ఓటు హక్కు ఉందని..

ఆ ఓటును తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు వెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన ఓటును తొలగించేందుకు దరఖాస్తు వచ్చిందని ఐరాల తహశీల్దార్ తనకు ఫోన్ చేసి చెప్పడంతో షాకయ్యానన్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు ఓట్ల తొలగింపునకు టీడీపీనే కారణమని సునీల్ ఆరోపించారు. ఓటమి భయంతో టీడీపీ చేస్తున్న దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు.

నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల మంది వైసీపీ కార్యకర్తల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు అందాయని.. ఇది ముమ్మాటికీ కుట్ర అంటున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *