తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదంటున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.

భర్త భార్గవ్ అదృశ్యం.. మాజీ మంత్రి అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు
తన భర్తపై కేసులు, అదృశ్యంపై స్పందించిన మాజీ మంత్రి అఖిలప్రియ. తమపై కుట్ర జరుగుతోందన్న అఖిలప్రియ. దీని వెనుక జగన్ సర్కార్ హస్తముందని ఆరోపిస్తున్న మాజీ మంత్రి.

తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదంటున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. పారిపోవాల్సిన అవసరం లేదని..

ఈ కేసులు గొడవ మొదలైనప్పటి నుంచి తనతో టచ్‌లో లేరని చెప్పుకొచ్చారు. తన భర్తపై నమోదైనవి తప్పుడు కేసులని పోలీసులకు తెలుసని.. తనకు క్రషర్‌లో భాగం ఉంది.. సమాన హక్కులు ఉన్నాయన్నారు.

ఇదే విషయాన్ని తన భర్త వెళ్లి అడిగితే పెద్ద నేరం, ఘోరమని చూపిస్తున్నారని.. ఎవర్ని కొట్టలేదు.. దెబ్బలు తగలలేదు..

అలాగనీ ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సివిల్ మ్యాటర్.. కూర్చొని మాట్లాడుకునే విషయాలనే తాము క్రషర్ వివాదాన్ని సీరియస్‌గా తీసుకోలేదన్నారు అఖిలప్రియ.

ఒకవేళ తాము వార్నింగ్ ఇవ్వాలనుకుంటే.. మంత్రిగా ఉన్నప్పుడే చేసేవాళ్లమన్నారు. దౌర్జన్యాలు చేయడం, ఆస్తులు లాక్కోవడం, తప్పుడు కేసులు పెట్టడం వంటివి ఎప్పుడు చేయలేదని.. తమ కుటుంబానికి మంచి పేరు ఉందన్నారు. అందులోనూ ఆ క్రషర్ పార్టనర్ కూడా తెలిసిన వ్యక్తి అన్నారు.

తన భర్తపై కేసుల వెనుక చాలామంది ఉన్నారని.. వైఎస్సార్‌‌సీపీ కావొచ్చు.. పోలీసులు కావొచ్చు అన్నారు మాజీ మంత్రి.

జగన్ పర్మిషన్ లేకపోతే తెలంగాణలో కేసులు పెట్టడం.. ఇంత చిన్న కేసుకు ఎస్సై కు ఎస్పీ ఫోన్ చేసి కేసులు పెట్టమని చెప్పడం వంటివి జరగవన్నారు.

ఇవి ఎందుకు జరుగుతున్నాయో తెలియదని.. తాను యురేనియం విషయంలో పులివెందులకు వెళ్లొచ్చినందుకు ఈ కేసులు పెడుతున్నారనే అనుమానం ఉందన్నారు.

అధికారంలోకి రాగానే పోలీసుల్ని అడ్డుపెట్టుకొని ఇలా చేస్తున్నారని.. పోలీసులపై కూడా ఒత్తిడి చేస్తున్నారన్నారు.

తమకు కేసులు కొత్తేమీ కాదని.. కేసులతో కంగారుపడబోమని చెప్పారు అఖిల.

తాము ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్ని చూశామని.. తప్పు చేసుంటే కంగారుపడేవాళ్లమని.. న్యాయ పోరాటం చేస్తున్నాం.. కోర్టులో పిటిషన్ వేశాం అన్నారు.

తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు అఖిలప్రియ. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని..

ఒక చిన్న గొడవను హత్యాయాత్నంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *