పవన్ లో చెలరేగిన అభద్రతాభావం

ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్ని పార్టీ నేతలు చిరంజీవి చెంతకు పోలో మంటూ వలసపోయారు. తర్వాత ఎవరికి వారు వచ్చేసారు కూడా.
కానీ ఇప్పుడు జనసేన పరిస్థితి అది కాదు. మంత్రి పదవి ఓడిపోవడంతో టిడిపి నుండి ‘రావెల’ బీజేపీకి భవిష్యత్తు లేదని తెలుసుకున్న ‘ఆకుల’ తప్ప ఇంకెవరూ ఆ పార్టీపై కన్నెత్తి చూడటం లేదు.
వారు ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిస్తే అన్ని పార్టీ నేతలు వస్తాయని ఆశించిన పవన్ బోల్తా పడ్డారు. కానీ ఇప్పుడు ఆ వైఫల్యాన్ని తెలివిగా కవర్ చేసుకుంటున్నారు జనసేన అధినేత పవన్.
“జనసేన పార్టీ లోకి వెళ్తే సేవ చేయాలి తప్ప అవినీతిగా డబ్బు సంపాదించే అవకాశం ఉండదని, అందుకే కొంతమంది నాయకులు జనసేన లోకి రావడం లేదు” అన్నారు.
“జనసేన పార్టీకి ఉన్న మహిళా శక్తిని, యువశక్తి ని రాజకీయ శక్తిగా గుర్తించడానికి ఏ రాజకీయ నాయకులు ఇష్టపడటం లేదు” అన్నారు.
ఇదంతా పవన్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మెగా సోదరులు ఇంతకంటే ఎక్కువ మాట్లాడారు. అక్రమాలు అవినీతి లేని సామాజిక న్యాయం ఊదరగొట్టాడు.
ఇంత మాట్లాడి పార్టీ పెట్టిన వాళ్లే కాంగ్రెస్ కి అమ్ముడు పోవడంతో అటు మిగిలిన నాయకులతో సహా జనం కూడా చీదరించుకున్నారు.
ఇది ఇలా ఉండగా జనసేన అలాంటి పార్టీ కాదని అంటున్న పవన్ ని ప్రజలు ఎలా నమ్మాలి?.
అసహనంలో ఉన్న పవన్ ని ఉన్న నేతలు కూడా చేజారి పోతారేమో అన్న భయం వెంటాడుతోంది.
“జనసేన పార్టీ నాయకులు పగలు పవన్తో, రాత్రి వేరే పార్టీలో ఉంటే తెలియకుండా ఉండదు. అని అనుకోవద్దు మమ్మల్ని, మా నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాలలో ఎదుగుతాము అంటే చూస్తూ ఊరుకోమని, తన చుట్టూ ఉన్న వారిని హెచ్చరించారు జనసేనాని.
ఓ వైపు పేరున్న నాయకులతోపాటు, మరో వైపు ఉన్న వాళ్లు కూడా పక్క చూపులు చూస్తున్నారు.
పవన్ లో పెరుగుతున్న అభద్రతకి ఇదే ఉదాహరణ.
టిడిపి తనతో రావాలని కోరుతూ గాలం వేస్తోంది.
సర్వేలో వైసిపికి జోరుకు అద్దం పడుతోంది.
ఈ పరిణామాలన్నింటితో పవన్ డైలమాలో పడ్డాడు అని సన్నిహిత వర్గాలు అంటున్నారు.