లాడెన్‌ కొడుకు సమాచారం ఇస్తే రూ.7 కోట్లు

‘జీహాద్‌కు కాబోయే రాజు’గా ఉగ్రవాదులు తరుచూ చెప్పుకొనే బిన్ లాడెన్ కొడుకు హమ్జా గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కడున్నాడో స్పష్టమైన సమాచారం లేదు.

బిన్ లాడెన్ కొడుకు హమ్జా బిన్ లాడెన్‌పై కోసం అమెరికాలో వెతుకుతోంది. అతడి ఆచూకీ చెబితే రూ.7కోట్లు ఇస్తామని యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది.

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్‌లాడెన్ పేరు చెబితే చాలు అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కి పడుతుంది. అమెరికా చరిత్రలో అతిపెద్ద విషాదంగా నిలిచిపోయిన 2001లో సెప్టెంబర్ 11న ఉగ్రదాడులతో ప్రపంచమే దిగ్భ్రాంతికి గురైంది.

విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు వాటితో ప్రపంచ వాణిజ్య కేంద్రం (WTO) టవర్స్‌ను కూల్చివేశారు. ఈ దాడిలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

దీనికి ప్రధాన సూత్రధారి అయిన ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను పదేళ్ల తర్వాత 2011లో పాకిస్థాన్‌లో అమెరికా కమాండోలు మట్టుబెట్టారు. అధినేత లేకపోవడంతో ఆ ఉగ్ర సంస్థ క్రమంగా పట్టుకోల్పోయింది.

అయితే తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ ఆల్‌ఖైదాకు ఊపిలూదుతున్నాడు. ‘జీహాద్‌కు కాబోయే రాజు’గా ఉగ్రవాదులు తరుచూ చెప్పుకొనే హమ్జా గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కడున్నాడో స్పష్టమైన సమాచారం లేదు.

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, సిరియాల్లోనో లేదా ఇరాన్‌లో గృహనిర్బంధంలోనో ఉన్నట్లు ఊహాగానాలున్నాయి. అతడితో తమకు ఎప్పటికైనా ముప్పేనని ఆందోళన పడుతున్న అమెరికా. హమ్జా ఆచూకీ చెబితే 1 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 7.08 కోట్లు) అందిస్తామని ప్రకటించింది.

ఒసామా బిన్‌ లాడెన్‌ హతమైన అనంతరం అతని ముగ్గురు భార్యలు, పిల్లలు క్రమేపీ సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందారు. హమ్జా ఎక్కడ ఉన్నాడన్నది మాత్రం స్పష్టం కాలేదు.

తన తల్లితో కొద్ది సంవత్సరాలు ఇరాన్‌లో ఉన్నాడన్న ప్రచారం ఉంది. ప్రత్యర్థి దేశమైన సౌదీ అరేబియాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్‌ అతడిని గృహనిర్బంధంలో ఉంచినట్లు ఊహాగానాలున్నాయి.

అయితే అతని సవతి సోదరుడొకరు గత ఏడాది ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ హమ్జా ఉనికి తమకు తెలియదని, అఫ్గానిస్థాన్‌లో ఉండొచ్చని తెలిపాడు.

అమెరికాపై ఆల్‌ఖైదా దాడుల్లో కీలక పాత్ర పోషించిన మహమ్మద్‌ అట్టా కుమార్తెను హమ్జా పెళ్లి చేసుకున్నట్లు కూడా తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *