ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య వాతావారణం చాలా వేడిగా ఉంది…

ఆ గొప్పలన్నీ ఉత్తవే.. పాక్ యూటర్న్
గాయపడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌ను పాకిస్థాన్ అసభ్యకరంగా చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
ఇది అంతర్జాతీయ మానవతా చట్టంలోని అన్ని నిబంధనలను, జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య వాతావారణం చాలా వేడిగా ఉంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడులు చేయడం పట్ల పాకిస్థాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది.
ఎలాగైనా భారత్‌పై దాడులు చేయాలని చూస్తోంది.
బుధవారం ఉదయం పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ యుద్ధ విమానాలను భారత సైన్యం ధీటుగా తిప్పి కొట్టింది.
ఒక పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేసింది. పైలట్ పారాచ్యూట్ సాయంతో తప్పించుకున్నట్లు భారత సైన్యం చెబుతోంది.
మరోవైపు, భారత వైమానికి దళానికి చెందిన మిగ్ 21 బైసన్ యుద్ధ విమానం కూడా కూలిపోయింది.
ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న భారత పైలట్ అభినందన్ దురదృష్టవశాత్తు పాక్ భూభాగంలో పడిపోయారు. ఆయన్ని పాక్ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది.
మొదట రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేశామని, ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పిన పాకిస్థాన్..
ఇప్పుడు మాట మార్చింది. అభినందన్ మాత్రమే తమ అదుపులో ఉన్నట్లు ప్రకటించింది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావారణం తీవ్రతరం అవుతుండటం పట్ల యూకే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంయమనం పాటించాలని, ఇరు దేశాలు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని సూచిస్తోంది.
రెండు దేశాలతో మేం ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. చర్చలు, దౌత్యం ద్వారా పరిస్థితులను చక్కదిద్దాలని సూచిస్తున్నాం: యూకే పీఎం థెరీసా మే
పుల్వామా ఉగ్రదాడిలో జైషే పాత్ర, పాకిస్థాన్‌లో జైషే ఉగ్రస్థావరాలు, దాని నేతల ఉనికికి సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని పాకిస్థాన్‌కు అందజేశాం.
పాకిస్థాన్ తక్షణమే స్పందిస్తుందని, తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం: భారత విదేశాంగ శాఖ
గాయపడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌ను పాకిస్థాన్ అసభ్యకరంగా చూపించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
ఇది అంతర్జాతీయ మానవతా చట్టంలోని అన్ని నిబంధనలను, జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం వారి కస్టడీలో ఉన్న భారత పైలట్‌కు ఎలాంటి హాని తలపెట్టమని పాకిస్థాన్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
భారత పైలట్‌ను వెంటనే సురక్షితంగా వెనక్కి పంపిస్తారని భావిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పాకిస్థాన్ డిప్యూటీ హై కమిషనర్‌కు సమన్లు పంపింది.
తమ ఆధీనంలో ఒక ఇండియన్ పైలట్ మాత్రమే ఉన్నారని పాకిస్థాన్ భద్రతా బలగాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆశిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు.
మిలట్రీ చట్టాల ప్రకారం వింగ్ కమాండర్ అభినందన్‌ను విచారిస్తామన్నారు.
పాకిస్థాన్ దుస్సాహసాన్ని నేతలంతా ఖండించారు. అలాగే అదృశ్యమైన మన పైలట్ సురక్షితంగా తిరిగిరావాలని కోరుకున్నారు. భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను,
నైతికతను కాపాడటానికి చేపట్టే అన్ని చర్యల పట్ల దేశ ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు: రాహుల్ గాంధీ
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ జనవరి 14న చేసిన పుల్వామా ఉగ్రదాడిని 21 రాజకీయ పార్టీల నేతలు నేటి సమావేశంలో ఖండించారు.
భారత సాయుధ బలగాలు ప్రతిచర్యను ప్రశంసించారు: విపక్ష పార్టీ సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
ఎంతో ధైర్య సాహసాలు గల ఐఏఎఫ్ పైలట్లలో ఒకరు అదృశ్యమయ్యారనే వార్త విని నేను చాలా బాధపడ్డాను. త్వరలోనే ఆయన సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన భద్రతా బలగాలకు అండగా మనమంతా నిలవాలి: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
సరిహద్దులో దాడుల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలి.
ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి రష్యా ప్రయత్నిస్తోంది: రష్యా అధ్యక్షుడు దిమిత్రి పెస్కోవ్ ప్రెస్ సెక్రటరీ
పాకిస్థాన్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షా పార్లమెంట్ సౌత్ బ్లాక్‌కు చేరుకున్నారు.
పాకిస్థాన్ డిప్యూటీ హై కమిషనర్ సయ్యద్ హైదర్ షాకు సమన్లు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ
భారత పైలట్ మా ఆధీనంలో ఉన్నారు. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను మేం కూల్చేశాం: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
వీరుడైన మన పైలట్ సురక్షితంగా తిరిగిరావాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఆ దేవుడు నిన్ను రక్షించాలి.
నీకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలి. జాతి మొత్తం నీ వెంట ఉంది: ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్
ఒక వేళ యుద్ధమే వస్తే, అది కచ్చితంగా నా చేతుల్లోనో, నరేంద్ర మోదీ కంట్రోల్‌లోనో ఉండదు.
ఉగ్రవాదంపై ఏంచేయాలో మీరేమైనా చెప్పదలచుకుంటే, వినడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మనం కూర్చొని మాట్లాడుకోవాలి: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ప్రపంచ చరిత్రలో తప్పుడు అంచనాల మూలంగానే యుద్ధాలన్నీ జరిగాయి. ఎవరైతే ఈ యుద్ధాలను ప్రారంభించారో వాళ్లకు ఇవి ఎప్పటికి ముగుస్తాయో కూడా తెలీదు. కాబట్టి,
నేను భారత్‌ను ఒకటే అడుగున్నాను, మీ దగ్గర, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆ తప్పులు మనమూ చేద్దామా?: పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ దాడిని తిప్పి కొట్టే క్రమంలో ఆ దేశానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూల్చేసింది.
దురదృష్టవశాత్తు మనం ఒక మిగ్ 21 బైసన్ జెట్‌ను కోల్పోయాం.
ఒక పైలట్ అదృశ్యమయ్యారు. పైలట్ తమ కస్టడీలో ఉన్నారని పాకిస్థాన్ చెబుతోంది. నిజానిజాలు తేలాల్సి ఉంది: విదేశీ వ్యవహారాల శాఖ
మన భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండటంతో పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టాం: విదేశీ వ్యవహారాల శాఖ
ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన దాడులకు పాకిస్థాన్ ప్రతి దాడికి ప్రయత్నించింది.
తన ఎయిర్‌ఫోర్స్‌ను ఉపయోగిచింది ఈరోజు ఉదయం భారత్‌పై దాడికి తెగబడింది:
విదేశీ వ్యవహారాల శాఖ ఇండియ్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ ఈరోజు మిగ్ 21 బైసన్ జెట్‌తో బయలుదేరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు ఏఎన్ఐ వెల్లడించింది. అభినందన్ తిరిగి రావాల్సి ఉందని పేర్కొంది.
ప్రధానమంత్రి కార్యాలయంలో భద్రతా బలగాల ఉన్నాధికారుల సమావేశం
భద్రతా, నిఘా సంస్థల ఉన్నతాధికారులు బుధవారం ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమయ్యారు.
పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ జెట్‌లు భారత గగనతలంలోకి అడుగుపెట్టడంపై వీరు భేటీ అయ్యారు.

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీనియర్ అధికారులు, ఇతర భద్రతా బలగాల ఉన్నతాధికారులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.
పార్లమెంట్ వద్ద విపక్షాల సమావేశానికి సంబంధించిన దృశ్యాలు
‘నా పేరు వింగ్ కమాండర్ అభినందన్. నేను ఐఏఎఫ్ అధికారిని.
నా సర్వీస్ నంబర్ 27981’ పాకిస్థాన్ ఆర్మీ విడుదల చేసిన వీడియో ఒక పైలట్ ఈ విధంగా చెప్తున్నారు. దీన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించలేదు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు పైలట్లను అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇద్దరు పైలట్లలో ఒకరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించామని, మరొకరు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. (పీటీఐ రిపోర్ట్)
రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని ఎల్ఓసీకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఎల్ఓసీ వద్ద హైఅలర్ట్.. ఆర్మీ, బీఎస్ఎఫ్ బలగాలతో పాటు ఐబీ అప్రమత్తత
పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడమే కాకుండా.
ఎల్ఓసీ వెంబడి భారీ పేలుడు పదార్థాలను పడేసిన నేపథ్యంలో సరిహద్దు వెంబడి భారత్ హైఅలర్ట్ ప్రకటించింది. ఆర్మీ,
బీఎస్ఎఫ్‌తో పాటు ఐబీని అప్రమత్తం చేసింది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జెట్‌ను పాక్ కూల్చివేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. (పీటీఐ రిపోటర్ట్)
ఎయిర్‌స్పేస్ భద్రతా కారణాల దృష్ట్యా అమృత్‌సర్ ఎయిర్‌పోర్టును మూసివేశాం.
ఏ వాణిజ్య విమానాలు అమృత్‌సర్ రావడంలేదు. అలాగే ఇక్కడి నుంచి ఒక్క విమానం కూడా టేకాఫ్ తీసుకోదు: ఏపీ ఆచార్య, అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్
ఎయిర్ స్పేస్‌ను మూసివేసిన కారణంగా శ్రీనగర్, జమ్ము, ఛండీగఢ్, అమృత్‌సర్, డెహ్రాడూన్ విమానాలను తాత్కాలికంగా రద్దుచేసినట్లు భారత విమానయాన సంస్థ ఇండిగో వెల్లడించింది. (రాయిటర్స్ రిపోర్ట్)
కార్యక్రమం మధ్యలోనే బయటికి వచ్చేసిన మోదీ, భద్రతపై రివ్యూ మీటింగ్‌కు హాజరు
విజ్ఞాన్ భవన్‌లో జరగుతోన్న నేషనల్ యూత్ ఫెస్టివల్ 2019 వేడుకలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
విద్యార్థులు అడుగుతోన్న ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెబుతున్నారు. అయితే ప్రధాన మంత్రి కార్యాలయానికి అధికారి ఒకరు ఓ చిన్న పేపర్‌ను మోదీకి ఇచ్చారు.
దానిలో సమాచారం చదివిన వెంటనే ఆ కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా మోదీ బయటికి వచ్చేశారు.
అక్కడి నుంచి బయలుదేరి భద్రతపై నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా భారత ఎయిర్ స్పేస్‌లోకి పాకిస్థాన్ అడుగుపెట్టడంపై ఈ రివ్యూ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు.
భారత్, పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ద్వారా ప్రయాణించే అంతర్జాతీయ విమానాలకు ముప్పు పొంచిఉంది.
దీంతో కొన్ని విమానాలను వెనక్కి పంపారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. (ఏఎన్ఐ రిపోర్ట్)
లాహోర్, ముల్తాన్, ఫైసలాబాద్, సెయిల్‌కోట్, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు తక్షణమే నిలిపివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఏఎన్ఐ రిపోర్ట్)
పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ నుంచి ఎల్ఓసీ వెంబడి ఆ దేశ ఎయిర్ ఫోర్స్ దాడులు చేస్తున్నట్లు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ వెల్లడించారు.
తమ హక్కులను కాపాడుకోవడానికి, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పడానికి ఈ దాడులు చేస్తున్నామన్నారు.
ఈ సమస్యను పెద్దది చేయాలని తాము భావించట్లేదని, కానీ తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఈ చర్య అని చెప్పారు.
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఏ, రా చీఫ్, హోం సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు.
పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం భారత ఎయిర్ స్పేస్‌లో ప్రవేశించింది. నౌసెరా సెక్టార్‌లోని లామ్ వ్యాలీకి ప్రవేశించిన ఈ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది.
ఐదు విమానాశ్రయాలు మూసివేత
జమ్మూకశ్మీర్‌లోని బుడ్గమ్ జిల్లాలో ఆర్మీకి చెందిన చాపర్ కూలిపోయిన నేపథ్యంలో.
ఐదు విమానాశ్రయాలను భారత్ మూసివేసింది. శ్రీనగర్, జమ్మూ, లేహ్ విమానాశ్రయాలతో పాటు ఛండీగఢ్, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుల నుంచి పౌరవిమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది.