తుంపాల వి.వి.రమణ సుగర్ ఫ్యాక్టరీ లో క్రాసింగ్ నిలిపివేయడంతో చెరుకు రైతుల ఆందోళన…

గత పది రోజులుగా తుంపాల వీ.వీ.రమణ సుగర్ ఫ్యాక్టరీ లో చెరకు క్రషింగ్ కు నోచుకోలేక పోవడంతో ఫ్యాక్టరీ ఆవరణలోనే చేరకు ఎండిపోయి రంగు మారిపోతుంది.

దీంతో రైతులు తాము తీసుకొచ్చిన చెరకు ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రాసింగ్ కి ఎప్పుడు పిలుస్తారని ఫ్యాక్టరీ ఆవరణలోనే తిండి తిప్పలు లేకుండా రైతులు ఎదురు చూస్తున్నారు.

రోజుల తరబడి ఫ్యాక్టరీ వద్దే ఉండిపోతున్నారు. అలాగే ఏదో విధంగా ఆహారం తీసుకుంటున్న ఎడ్లబండ్లపై ఇక్కడకు చెరుకు తీసుకురావడంతో ఎద్దులకు కనీసం ఆహారం కూడా దొరక్క పశువులు నానా అవస్థలు పడుతున్నాయి.

ఇక్కడ గలఎండిన చెరుకు తినే పరిస్థితి లో పశువులు ఉన్నాయంటే ఇక్కడ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతుంది.

ఇంత జరుగుతున్నా ఇక్కడ పాలకులుగాని ,యజమాన్యం గాని కనీసం పట్టించుకోవడం చాలా దారుణం అని రైతులు వాపోతున్నారు.

దీనిపై ఫ్యాక్టరీ ఎండి కి తెలియ చేద్దామన్నా కనీసం ఫ్యాక్టరీ ముఖం చూడటం లేదని రైతులు వాపోతున్నారు.

రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఫోన్లో కూడా ఎండి అందుబాటులోకి రావడం లేదని వాపోతున్నారు.

ఎండి కాకపోయినా ఇక్కడున్నా మిగిలిన అధికారులను, సిబ్బందిని క్రాసింగ్ పై నిలదీస్తే అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు.

అసలు మా గోడు పట్టించుకునే నాధుడే లేడని రైతులు వాపోతున్నారు.

వెంకుపాలెం ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన మూడు రోజుల్లో మీకు డబ్బులు చెల్లిస్తానని జన్మభూమి కార్యక్రమంలో ప్రకటన ద్వారా చెప్పారు.

తీరా మేము ఇప్పుడు చెరుకు ఫ్యాక్టరీకి తోలి నెల రోజులైనా డబ్బులు చెల్లించలేదు.

పంచదార మార్కెటింగ్ అవ్వకపోయినా డబ్బులు చెల్లిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఇప్పుడుఇప్పుడు మాత్రం రమ్మని గాలికి వదిలేశారు అంటూ రైతులు వాపోతున్నారు.

ఫ్యాక్టరీ లో ఉన్న తాత్కాలిక ఎండి ఇక్కడ గల ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మగా తయారయ్యారు.

MD కి రైతుల పట్ల అసలు బాధ్యత లేకుండా పోయింది. మేము రోజుల తరబడి ఈన్ని ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాధుడే లేడు.

రైతులంతా అన్ని విధాలా నష్టపోయాం. మాతో పాటు నోరులేని మూగజీవాలను పశువులు కూడా తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నాయి.

ఇప్పటికైనా మా సమస్యలు పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *