ప్రచార కార్యక్రమం మధ్యలోనే ఎవరికీ చెప్పకుండా మాయమయ్యారు :ఆదాల

సాధారణంగా పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎవరైనా ప్రత్యర్థి పార్టీలోకి ఫిరాయిస్తారు. అదేంటో పోటీచేయండని టీడీపీ టికెట్ ఇచ్చినా,

తొలిజాబితాలో పేరున్నా మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారబోతున్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల టీడీపీ తరపున పోటీలో ఉన్నారు.
కొన్ని నెలలుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు కూడా.

అయితే గెలుపుపై ధీమాలేని ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని సమాచారం.మొన్న టీడీపీ టికెట్.. నిన్న జంప్?

ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం ప్రచార కార్యక్రమం మధ్యలోనే ఎవరికీ చెప్పకుండా మాయమయ్యారు ఆదాల.

కనీసం ఆయన సన్నిహితుల దగ్గర కూడా సమాచారం లేకపోవడంతో ఆదాల రహస్యంగా జగన్ తో భేటీకి వెళ్లారని అంటున్నారు.

వైసీపీ తరపున కావలి శాసనసభ లేదా, నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీచేసేందుకు ఆదాల సిద్ధమవుతున్నారని సమాచారం.

అయితే వివేకానందరెడ్డి హత్యకు గురికావడం, జగన్ పులివెందులకు వెళ్లడంతో ఆదాల చేరిక వాయిదా పడినట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లాలో మాత్రం ఆదాల అదృశ్యం రాజకీయంగా కలకలం రేపింది. టీడీపీ నేతలు అలాంటిదేమీ లేదని చెబుతున్నా.. అధికారిక ప్రకటన కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.

అసలేం జరిగింది..?
మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్కా బిజినెస్ మేన్. కేవలం కాంట్రాక్ట్ వర్క్ ల కోసమే ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్నారు.

కోవూరులో పోటీచేయాలనే కోరిక ఉన్నా చంద్రబాబు ఆదేశాల మేరకు అయిష్టంగానే నెల్లూరు రూరల్ ని తీసుకున్నారు. అయితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బలంగా ఉన్నారు.

గెలుపు అసాధ్యమని తేలడంతో ఆదాల డైలమాలో పడ్డారు. ప్రచారం చేసుకుంటున్నారే కానీ పోటీకి ధైర్యం చాలలేదు.

చివరిగా తనకు రావాల్సిన కాంట్రాక్ట్ పనుల సొమ్ము బకాయిలు గురువారానికి క
గురువారానికి క్లియర్ కావడంతో ఆదాల ఒక్కరోజులోనే జెండా పీకేశారని తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు ఆదాల.

అయితే కోవూరు టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి వచ్చిన మెజార్టీకంటే అక్కడ ఎంపీగా ఆదాలకు పడ్డ ఓట్లే ఎక్కువ.

ఆ ధైర్యంతోనే ఆయన కోవూరు టీడీపీ టికెట్ ఆశించారు. చంద్రబాబు కాదనడంతో నెల్లూరు రూరల్ కి వచ్చారు.

తీరా ఇప్పుడు ప్రచారం ఖర్చు కూడా వృథా అని తేలడంతో ఆయన నెల్లూరు ఎంపీగా వైసీపీ తరపున టికెట్ కోసం జగన్ ను అభ్యర్థిస్తున్నారు.

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారం రీత్యా ఈసారి పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో ఆదాల లైన్ క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి.

అది కుదరకపోతే కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాలకు మరో ఆప్షన్ ఉంది. ఏదేమైనా తొలి జాబితాలో పేరున్న అభ్యర్థి టీడీపీని వీడటం ఆ పార్టీకి జిల్లాలో కోలుకోలేని దెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *