రంగు మారిన రాజకీయాలు… నల్ల రంగు చొక్కాలో నిరసన తెలుపుతూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు!

రాజకీయ నాయకులు రంగులు మార్చడం చాలా సహజమైన విషయం. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అయితే 3 రంగుల వాడే.

లోకాన్ని సదా పచ్చ రంగు తో చూసే ఆయన పచ్చ రంగు మనుగడ కోసము ఉపయోగించగా… మనుగడ కోసం ఓసారి ఎరుపు రంగును, మరోసారి గులాబీ రంగును, ఇంకోసారి కాషాయరంగు ను పులుముకుంటూ ఉన్నాడు.

40 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ప్రజలు ఇలాంటి రంగులు మార్చే వైఖరి చాలానే చూశాడు. కానీ ఇప్పుడు ఆ హఠాత్తుగా చంద్రబాబు నల్ల రంగును ధరించాడు

అసెంబ్లీలో ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేసిన మోసానికి నిరసనగా తీర్మానం చేయనున్నారు.

దీనికిగాను ముఖ్యమంత్రి నల్ల రంగు చొక్కా తొడుక్కుని హాజరయ్యారు

Ap cm Chandra Babu Naidu in Black shirt

ఈ ఫోటోను చూస్తే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న మరో వ్యక్తికి చంద్రబాబునాయుడు గాడిదల అతికించినట్లుగా ఉంటుంది.

కానీ జాగ్రత్తగా గమనిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు రంగు మార్చారని అర్థమవుతుంది.

అతనే కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను అందర్నీ నల్ల చొక్కాలు తొడుక్కొని రావాలని హుకుం జారీ చేసాడు.

ఫిబ్రవరి ఒకటో తేదీ నాడు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయాలని ఎమ్మెల్యేలందరినీ నల్ల చుక్కలు వేసుకోవాలి అని పిలుపు ఇవ్వగానే, ఆయన కేవలం చొక్కా రంగు మాత్రమే మారుస్తారని అంతా అనుకున్నారు.

కానీ ఆయన చొక్కా కి మ్యాచ్ అయ్యేలా కూడా మార్చి తెల్లని రంగు ఫాంట్ ధరించాడు.

ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులలో అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోకుండా చూసుకోవాలని చంద్రబాబు చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన ముందు ముందు ఈ మూడు నెలల్లో ఎన్ని రంగులు పులుము కుంటాడో చూడాలి చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *