కేసీఆర్ ప్రెస్ నుండి ముఖ్యమైన విషయాలు సమీక్ష

ప్రెస్మీట్ లో చంద్రబాబు గురించి కేసీఆర్ విరుచుకుపడ్డాడు అని కేసీఆర్ ని ముక్కోడు, తాగుబోతోడు, బక్కోడు, ఫార్మ్ హౌస్ లో తొంగుంటాడు అని మొరగడం కాదు.. మీకు తెలివి అనేది ఉంటే, మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోరుకునేవాళ్లే అయితే కేసీఆర్ మాట్లాడిన విషయాలకు టెక్నికల్ గా పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వండి..

● కేసీఆర్ చెప్పినట్టు రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీని హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ లో, మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణంలో వాడారు అనేది అబద్ధం,, ఆ రాఫ్ట్ ఫౌండేషన్ టెక్నాలజీని దేశంలో మొదటిసారి అమరావతిలోనే సెక్రటేరియట్ కట్టడం కోసమే వాడుతున్నారు అని ప్రూవ్ చెయ్యండి..

● కేసీఆర్ చెప్పినట్టు హైదరాబాద్ కి ఐటి వచ్చింది రాజీవ్ గాంధీ హయాంలో, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు,, చంద్రబాబే ఐబీఎం కంపెనీని హైదరాబాద్ కి తీసుకొచ్చి సైబర్ టవర్స్ బిల్డింగ్ కి పునాది వేసాడు అని ప్రూవ్ చెయ్యండి..

● కేసీఆర్ చెప్పినట్టు హైకోర్టు బిల్డింగ్ జనవరి 1st కి ఏపీలో సిద్ధం అవుతుందని సుప్రీంకోర్టుకి చంద్రబాబు అఫిడవిట్ ఇవ్వలేదు,, ఇంకో రెండు మూడు నెలలు గడువు అడిగినా వినకుండా హడావిడిగా గెంటేస్తున్నారు అని ప్రూవ్ చెయ్యండి..

● కేసీఆర్ చెప్పినట్టు చంద్రబాబు ప్రత్యేక హోదా వేస్ట్ అనలేదు, హోదా అంటే జైలుకి పంపుతా అనలేదు,, ముందు నుండి చంద్రబాబు హోదా కోసం కేంద్రంతో పోరాడాడు అని ప్రూవ్ చెయ్యండి..

● కేసీఆర్ చెప్పినట్టు హరికృష్ణ మరణం సానుభూతిని సొమ్ము చేసుకోవడం కోసమే సుహాసినికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు,, ముందునుంచి కూడా హరికృష్ణకి, హరికృష్ణ కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అని ప్రూవ్ చెయ్యండి..

● కేసీఆర్ చెప్పినట్టు నాలుగేళ్లు మోడీ చంక మా చంద్రబాబు నాకలేదు, ఇప్పుడు రాహుల్ గాంధీ చంక నాకట్లేదు అని ప్రూవ్ చెయ్యండి.. అలాగే మోడీ చంక నాకుతూ రాహుల్ గాంధీని,, రాహుల్ గాంధీ చంక నాకుతూ మోడీని తిట్టలేదు అని ప్రూవ్ చెయ్యండి..

● కేసీఆర్ చెప్పినట్టు చంద్రబాబుకి పరిపాలన ఏమీ తెలియకపోయినా బాకా పేపర్లలో ఫ్రంట్ పేజ్ లో హెడ్లైన్స్ రాపించుకుని, కలర్ బొమ్మలు చూపిస్తూ జనాలను మోసం చెయ్యడం లేదు అని ప్రూవ్ చెయ్యండి..

● కేసీఆర్ చెప్పినట్టు ముఖ్యమంత్రుల మీటింగ్ లో దేశంలో ఒక ముఖ్యమంత్రి నుండి ప్రధాని అయిన మొదటి వ్యక్తి మోడీనే అని చంద్రబాబు చెప్పలేదు, అది అబద్ధం అని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత స్టేట్మెంట్ ఇప్పించండి..

● కేసీఆర్ చెప్పినట్టు చంద్రబాబుకి ఇంగ్లీష్, హిందీ రాదు అనేది అబద్ధం,, చంద్రబాబు ఇంగ్లీష్, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడతాడు అని హిందీ, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ మాట్లాడిన వీడియోస్ చూపించండి..(GK)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *