పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తా.. జగన్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు

పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తా.. జగన్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు
ఉంగుటూరు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అని ప్రశ్నించారు. ఇంట్లో పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తానని చెప్పారు. జగన్‌ను ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు.
ఉంగుటూరు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అని ప్రశ్నించారు.
ఇంట్లో పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలు ఆపేస్తానని చెప్పారు.
జగన్‌ను ఉద్దేశించి పవన్ విమర్శలు గుప్పించారు.
ఉంగుటూరు: శుక్రవారం భీమవరంలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్.. అనంతరం ఉంగుటూరు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అని పవన్ ప్రశ్నించారు. ఆ గట్టునేమో వైసీపీ, టీడీపీ ఉన్నాయి.. ఈ గట్టునేమో జనసేన, బీఎస్పీ, కమ్యూనిస్టులు ఉన్నారన్నారు. జగన్ పులివెందులలో ఉంటారు.. చంద్రబాబు కుప్పంలో ఉంటారు. నేను మీ పక్కనే ఉంటానని ఉంగుటూరు ప్రజలకు పవన్ హామీ ఇచ్చారు.
‘ఇంట్లో పినతండ్రి వివేకానంద రెడ్డి చనిపోతే.. వేలి ముద్రలు, రక్తం మరకలు చెరిపేసి.. తొలుత గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. తర్వాత గొడ్డలితో నరికి చంపారన్నారు. అలాంటి కుటుంబం నుంచి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలా? అని పవన్ ప్రశ్నించారు. సొంత పినతండ్రి చనిపోతే నేనైతే ఎన్నికలను ఆపేస్తాను. మా పినతండ్రి ఎందుకు చనిపోయారో కనుక్కుంటా’నని జనసేనాని తెలిపారు.
మీరు హత్య చేశారని అనడం లేదు. సాక్ష్యాలు మాయం చేయడమేంటి? అలాంటి వాళ్లు సీఎం కావొద్దని పవన్ అభిప్రాయపడ్డారు. నేర ప్రవృత్తి ఉన్న కుటుంబాలను ప్రోత్సహించొద్దు. అది సమాజానికి మంచిది కాదన్నారు.
టీడీపీ ప్రభుత్వం అవినీతితో నిండిపోయింది. బాబుకు ఎమ్మెల్యేల మీద పట్టుపోయిందని పవన్ చెప్పారు. మీ భవిష్యత్తును పణంగా పెట్టి నా భవిష్యత్తును నిర్మించుకోవడానికి రాలేదని జనసేనాని తెలిపారు.