బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం.. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..సీఎం జగన్ ఆదేశాలు..

మాణిక్యాలరావుకు కరోనా ఎలా సోకిందంటే.. వైరల్ అవుతున్న చివరి మాటలు

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా బారినపడి కన్నుమూశారు. ఆయన చేసిన చివరి ట్వీట్ వైరల్ అయింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) కరోనా వైరస్ బారినపడి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్‌, బీజేపీ నేత ఈతకోట తాతాజీకి (భీమ శంకరరావు) కరోనా సోకింది. ఆయనకు కరోనా సోకినట్లు గుర్తించక ముందు, మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆయనతో కలిసి కారులో ప్రయాణించారు.

తాతాజీకి కరోనా సోకినట్లు తెలిసి మాణిక్యాలరావు కూడా ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అదే సమయంలో కరోనా బారిన పడ్డ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరగా కోలుకోవాలంటూ జూలై 25న మాణిక్యాలరావు ట్వీట్ చేశారు.

అనంతరం తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకు వివరించారు. ‘‘నా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దు. కంగారు పడవద్దు, అధైర్య పడవద్దు. నేను ఆరోగ్యంగానే వున్నా.

భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో నేను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను.’’ అని మాణిక్యాలరావు ట్వీట్ చేశారు.

ఇవే మాణిక్యాలరావు ప్రజలనుద్దేశించి చేసిన చివరి ట్వీట్.

అంత ధైర్యంగా ఉన్న మాణిక్యాలరావు కరోనా వల్ల మరణించడంతో ఆయన అనుచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాణిక్యాలరావు.. అకాల మరణంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, మాణిక్యాలరావు మృతిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

బీజేపీకి మాణిక్యాలరావు లేని లోటు ఎవరూ తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ లాంఛనాలతో మాణిక్యాలరావు అంత్యక్రియలు.. సీఎం జగన్ ఆదేశాలు

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించారు.

కరోనా వైరస్ బారినపడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్‌ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

మాజీ మంత్రికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.

కాగా, కరోనా బారినపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు.

ఆయన మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మాణిక్యాలరావుకు కరోనా ఎలా సోకిందంటే.. తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్‌, బీజేపీ నేత ఈతకోట తాతాజీకి (భీమ శంకరరావు) కరోనా సోకింది.

ఆయనకు కరోనా సోకినట్లు గుర్తించక ముందు, మాజీ మంత్రి మాణిక్యాలరావు ఆయనతో కలిసి కారులో ప్రయాణించారు.

తాతాజీకి కరోనా సోకినట్లు తెలిసి మాణిక్యాలరావు కూడా ముందు జాగ్రత్తగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఈ తరుణంలో జూలై 25న తాను త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా ప్రజలముందుకు వస్తానని ప్రజల్లో ధైర్యం నింపారు. ఇంతలోనే కరోనా మహమ్మారికి బలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *