జగన్ సమక్షంలో వైయస్సార్ సిపి పార్టీ లో చేరిన కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి

ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకుల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తమ రాజకీయ ప్రయోజనాలు భవిష్యత్ కోసం చాలామంది నాయకులు కండువాలు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు.

తాజాగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ కండువా కప్పుకున్నారు.

ఇవాళ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో హర్ష వర్ధన్ రెడ్డి పార్టీలో చేరారు. ఆయనతోపాటు కోడుమూరు నియోజకవర్గ పరిధిలో పలువురు ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచులు వైయస్సార్సీపి తీర్థం పుచ్చుకున్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వేల మంది కార్యకర్తలు కూడా తమ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి వెంట నేనడిచారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.

దీంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలో చేరారు.

ఇలాంటి గడ్డు కాలం లో కూడా కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల సోదరులు మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడలేదు.

అయితే ఆ ఐదేళ్లు గడిచినా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడటం పోవడంతో ఇక లాభం లేదని భావించిన కోట్ల సోదరులు పార్టీ మారడానికి సిద్ధమయ్యారు.

అయితే అన్నదమ్ములు ఇద్దరు ఒకే పార్టీ లోకి రాకుండా వేరువేరు పార్టీలో చేరుతూ రాజకీయంగా చీలిపోయారు.

మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టిడిపి వైపు మొగ్గు చూపగా. ఆయన సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపారు.

ఇంతకాలం ఒకే పార్టీలో ఉన్న అన్నదమ్ములు.

ఇప్పుడు రాజకీయంగా బద్ధశత్రులై తెలుగుదేశం, వైఎస్సార్సీపీ పార్టీల తరఫున పని చేయనున్నారని.

దీంతో కోటల కుటుంబంలో ఎలాంటి అలజడి రేగుతుందో నాని కర్నూల్ లో చర్చలు జరుగుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed