గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ అధిష్ఠానంపై అలకబూనారు.

టీడీపీపై రాయపాటి అలక… వైసీపీ పై వీస్తున్న గాలులు
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీ అయిన తనకు మళ్లీ టిక్కెట్ ఇచ్చే విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు.
- 1.నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అలకపాన్పు ఎక్కారు.
- 2.తన స్థానంపై ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు.
- 3.టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి వెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ అధిష్ఠానంపై అలకబూనారు. తనకు టిక్కెట్ కేటాయింపుపై ఎటూ తేల్చకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు.
నరసరావుపేట ఎంపీ టిక్కెట్ నిర్ణయం పెండింగ్‌లో పెట్టడం, ఆ టిక్కెట్‌ను భాష్యం రామకృష్ణకు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుండటంతో రాయపాటి వర్గం ఆందోళన చెందుతోంది.
తనకు నరసరావుపేట ఎంపీ టిక్కెట్, తన కుమారుడికి సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వాలంటూ రాయపాటి అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అయితే సత్తెనపల్లి టిక్కెట్ తనకే కేటాయించారని, 22న నామినేషన్ వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఓకే ఒక్క ఆశ(నరసరావుపేట ఎంపీ)పై కూడా స్పష్టత లేకపోవడంతో రాయపాటి మదనపడుతున్నారు. దీంతో రాయపాటి సోదరులు టీడీపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారు.
చంద్రబాబు తనకు అన్యాయం చేయరని సాంబశివరావు పైకి గంభీరంగా చెబుతున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
టీడీపీ పెద్దల వైఖరితో మనస్తాపం చెందిన రాయపాటి వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరందుకుంది. పలువురు వైసీపీ నేతలు సైతం ఆయనకు ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
అయితే టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై రాయపాటి కుటుంబం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ఎంపీ టిక్కెట్‌పై టీడీపీ ఏదొకటి తేల్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని రాయపాటి సాంబశివరావు అనుచరులతో అంటున్నట్లు సమాచారం.