విశాఖకు రాజధాని తరలింపునకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్..ఆగస్టు 15న భూమి పూజ

ఏపీ రాజధాని తరలింపునకు మూహూర్తం ఫిక్స్.. అదే రోజు భూమి పూజ!
విశాఖకు రాజధాని తరలింపునకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ 3 రాజధానులు
ఏపీ రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారైట్లు తెలుస్తోంది. దేశ స్వాత్రంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి భూమి పూజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు కూడా విశాఖ నగరంలోనే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దశలవారీగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా తరలించనున్నారు.
కాగా, ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఅర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఏపీలో అధికారికంగా మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయి.
ఇక ఆంధ్రప్రదేశ్‌కు శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి, పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు ఉంటాయి.
ఇదిలా ఉంటే 2019, డిసెంబర్ 18న తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి ప్రస్తావించారు.
తర్వాత ఈ అంశంపై డిసెంబర్ 20న ప్రభుత్వానికి జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇచ్చింది.
ఇక 2020, జనవరి 4వ తేదీన బీసీజీ గ్రూప్ మూడు రాజధానుల అంశంపై మరో నివేదిక సమర్పించింది. దీంతో ఈ ఏడాది జనవరి 20న పరిపాలన వికేంద్రీకరణ, సీఅర్డీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది.
అయితే రెండు రోజుల తర్వా మూడు రాజధానుల విషయంపై శాసనమండలిలో రగడ జరిగింది.
ఇక అదే రోజున చైర్మన్ విచక్షణాధికారంతో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు. అటు జూలై 17న గవర్నర్ ఆమోదం కోసం ఏపీ సర్కార్ రాజధాని వికేంద్రీకరణ బిల్లును పంపించగా.. జూలై 31న హరిచందన్ అధికారికంగా బిల్లుకు ఆమోదముద్ర వేశారు.