మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల..కోర్టు కీలక ఆదేశాలు

రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. కోర్టు కీలక ఆదేశాలు

మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు.

రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అనుచరుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ నేత కొల్లు రవీంద్రను శనివారం పోలీసులు మెజిస్ట్రేట్‌ ముందుహాజరు పరిచారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు.

జూన్‌ 29న హత్యానంతరం మోకా భాస్కర్ రావు బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో ఇతర నిందితులతో పాటు మాజీ మంత్రి కొల్లు పేరు ఉంది.

అలాగే కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే మోకా భాస్కర్‌రావును హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.

మరోవైపు హత్య కేసుకు సంబంధించి పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు బయపటడుతున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed