ఫేస్‌బుక్ ,వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలంటే సీఎం జగన్ అనుమతి.. లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలచేశారు.

లోకేష్.. మీ ఆవిడను గొడవలోకి ఎందుకు లాగుతావ్.. వైసీపీ కౌంటర్

ఫేస్‌బుక్ ,వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలంటే సీఎం జగన్ అనుమతి తీసుకోవాలేమో అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు. భర్త భార్యకు మెసేజ్ పెట్టాలన్నా భయపడాల్సి వస్తుందన్నారు. దీనికి వైఎస్సార్‌సీపీ కౌంటర్ ఇచ్చింది.

ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాలంటే సీఎం జగన్ అనుమతి తీసుకోవాలేమో అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు.

భర్త భార్యకు మెసేజ్ పెట్టాలన్నా భయపడాల్సి వస్తుందన్నారు. దీనికి వైఎస్సార్‌సీపీ కౌంటర్ ఇచ్చింది.

లోకేష్ కామెంట్స్‌కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. లోకేష్.. సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నారని గుర్తు చేశారు.

‘అవునా.. తీసుకుంటున్నావా.. ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?!’ అంటూ మండిపడ్డారు.

మంత్రి వెల్లంపల్లి కూడా లోకేష్ కామెంట్స్‌పై మండిపడ్డారు.

ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాలన్నా.. పెళ్లానికి మెసేజ్‌ పెట్టాలన్నా.. జగన్‌‌కు చెప్పాలని అన్నారని..

లోకేష్ తన భార్యకు మెసేజ్ పెట్టే సమయంలో జగన్‌‌కు చెప్పే పెడుతున్నారా అని ప్రశ్నించారు.

మీరు మీ భార్యకు నేరుగా మెసేజ్‌లు పెట్టుకోవచ్చు. మిగతావాళ్లు పెట్టాలంకే జగన్‌ పర్మిషన్‌ కావాలంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అసలు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని.. గతంలో హైదరాబాద్‌లో అరెప్ట్‌ వారిని ఎన్నెన్ని జిల్లాలు తిప్పారో గుర్తు లేదా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *