ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాలతో పాటు మరికొన్ని వరాలు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. సాగునీటి, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు మరింత పెంచారు..

రాష్ట్ర ప్రభుత్వ రైతులు, మహిళలు, పేదలు, యువత, నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. గతేడాది కంటే 18.48 శాతం కేటాయింపులు పెంచింది.

2019-20 ఏడాదికి గానూ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న బడ్జెట్‌పై చంద్రబాబు శాసనసభలో మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు దొరక్క 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.

పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకూ రూ.15,500 కోట్లు ఖర్చుచేసినట్టు ప్రకటించిన ఆర్థిక మంత్రి.

వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసనసభలో చేపట్టిన లఘుచర్చలో మాట్లాడుతూ.. దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ పెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని అన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయం వృద్ధిరేటు 11శాతం ఉండగా.. దేశంలో 2.4శాతమేని చంద్రబాబు చెప్పారు.

రైతుల ఆదాయం పెరిగేలా చేశామని, సూక్ష్మసేద్యంలో దేశంలోని తొలి 10 జిల్లాల్లో ఆరు ఏపీలోనే ఉన్నాయన్నారు.

శాసన మండలిలో 11.50 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ.

11 వసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోన్న మంత్రి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.

రూ.2.26 లక్షల కోట్ల ఏపీ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.180 లక్షల కోట్లు,

మూలధన వ్యయం 29,596 కోట్లు.

2019- 20 సంవత్సరానికి ఏపీ ఆర్థిక లోటు అంచనా 32,390.68 కోట్లు.

వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు కేటాయింపులు.

బీసీ సంక్షేమానికి రూ. 8,242.64 కోట్లు కేటాయింపులు.

ఉన్నత విద్యకు 3,171. 42 కోట్లు కేటాయింపు.

రైతులకు వినూత్న పథకం..

అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఆర్థిక సాయం.

అన్నదాత సుఖీభవ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయింపు.

పౌర సరఫరాల శాఖకు రూ.3,763.42 కోట్లు.

మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌కు రూ.1000 కోట్ల నిధి.

ఆహార శుద్ధి పథకానికి రూ.300 కోట్లు.

పశుగ్రాసం కోసం రూ.200 కోట్లు కేటాయింపు.

చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సహకానికి రూ.400 కోట్లు.

న్యాయశాఖకు రూ.911 .84 కోట్లు.

ఇళ్ల స్థలాల సేకరణకు రూ.500 కోట్లు.

నీటి పారుదల, జలవనరుల శాఖకు రూ.16,852 కోట్లు.

క్షత్రియుల సంక్షేమానికి రూ.50 కోట్లు.

డ్రైవర్స్ సాధికారత సంస్థకు రూ.150 కోట్లు కేటాయింపులు.

పాడి పరిశ్రమ, పశు సంవర్ధక శాఖలకు రూ. 2030.87 కోట్లు

ఆర్థిక శాఖకు రూ.51,841 కోట్లు.

క్రీడలు, యువజన సంక్షేమానికి రూ.1982.74 కోట్లు

విద్యుత్, మౌలిక వనరులకు రూ.5,347.

హోం శాఖకు 6,397 కోట్లు

మున్సిపల్ శాఖకు రూ.7979

ఐటీకి రూ.1006 కోట్లు కేటాయింపు.

కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు .

పశువుల భీమాకు రూ.200 కోట్లు

సాధారణ పరిపాలన శాఖకు 1170 కోట్లు.

ప్రాథమిక విద్యకు రూ. 22,783. 37 కోట్లు

నిరుద్యోగ భృతి రూ.1,000 నుంచి రూ.2,00 వేలకు

పెంపుగృహ‌ నిర్మాణ శాఖకు రూ.4079 కోట్లు

బ్రహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయింపులు,

పసుపు- కుంకుమ కోసం రూ4 వేలు కోట్లు.

కార్మిక, ఉపాధి శాఖ రూ.1,229 కోట్లు.

మహిళా, శిశు దివ్యాంగుల సంక్షేమానికి 3 వేల కోట్లు

ఎస్టీ సబ్ ప్లాన్ రూ.5 వేలు కోట్లు

ముఖ్యమంత్రి యువనేస్తం రూ.1,200 కోట్లు

బీసీ కార్పొరేషన్‌కు రూ.3,000 కోట్లు

విద్యుత్ మౌలిక వనరులు రూ.5,300 కోట్లు

అన్నా క్యాంటీన్లకు రూ.300 కోట్లు,

చంద్రన్న బీమాకు రూ.354 కోట్లు కేటాయింపు.

ప్రణాళికా విభాగానికి రూ.1,403 కోట్లు

ఆర్టీజీఎస్‌కు రూ.173 కోట్లు

ఆర్య వైశ్యుల సంక్షేమానికి రూ.50 కోట్లు

సామాజిక సౌకర్యాలకు ఎస్పీ కాంపోనెంట్ నుంచి రూ.600 కోట్లు

ఎన్టీఆర్ విదేశీ విద్యకు రూ.100 కోట్లు,

ఉపాధి హామీ పథకానికి రూ.1,000 కోట్లు

అటవీ, పర్యవరణ రంగాలకు రూ.491 కోట్లు,

సెకెండరీ విద్యకు రూ.3,171 కోట్లు.

చంద్రన్న పెళ్లి కానుకకు రూ.128 కోట్లు,

మైనార్టీల దుల్హన్ రూ.100 కోట్లు

హోంశాఖకు రూ.6,397 కోట్లు,

రాజధాని ల్యాండ్‌పూలింగ్ కోసం రూ.226 కోట్లు.

నైపుణ్యాభివృద్ధికి రూ.450 కోట్లు,

చేనేతకు రూ.225 కోట్లు.

రాష్ట్రంలో రైల్వే నిర్మాణానికి రూ.180 కోట్లు,

ఎస్సీ సబ్-ప్లాన్ రూ.14,347 కోట్లు,

ఎస్టీ సబ్-ప్లాన్ 5,385 కోట్లు

డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,100 కోట్లు

రోడ్లు, భవనాల శాఖకు రూ.5,387 కోట్లు, పరిశ్రమలు,

వాణిజ్య శాఖకు రూ.4,100 కోట్లుతొమ్మిది,

పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కోసం రూ.156 కోట్లు

వృద్ధాప్యపు, వింతతు పింఛన్లకు రూ.10,400 కోట్లు

పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ.35,152 కోట్లు,

కాపుల భవన నిర్మాణానికి రూ.128 కోట్లు

విభిన్న ప్రతిభావంతుల పింఛన్లు కింద రూ.2,137 కోట్లు,

ధరల స్థిరీకరణ నిధి కింద రూ.1,000 కోట్లు.

వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.10,032 కోట్లు,

శాసనసభ వ్యవహారాలకు రూ.149 కోట్లు.

బీసీ ఉప-ప్రణాళికకు రూ.16,222 కోట్లు,

చిన్న పరిశ్రమలకు ప్రోత్సహకాలు కింద రూ.400 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *