వైసీపీలో రెండు వర్గాల పోరు

పడకేసిన పార్టీ ఎన్నికల వేళ అంతా అయోమయం

విజయనగరం విజయనగరం జిల్లాలో రెండు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. రాష్ట్రమంతా పరిస్థితి ఒకలా ఉంటే విజయనగరం జిల్లాలో వేరేలా ఉంది.

జిల్లాల్లోని ఈ రెండు పార్టీలకు 2 అధినాయకులున్నారు.ఒక వర్గానికి ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వం వహిస్తున్నారు. బొత్స వర్గంగా పేరున్న మరో గ్రూపునకు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) నాయకత్వం వహిస్తున్నారు.

ఈ రెండు వర్గాల మధ్య అధిష్టానం సంగతేమో కానీ కార్యకర్తలు, ప్రజలు అడకతైరలో పోకచక్కలా నలిగిపోతున్నారు. ఈ రెండు వర్గాలు ఒకే రోజు మీడియా సమావేశం పెడతాయి. కార్యక్రమాలు కూడా రెండేసి జరుగుతాయి.

ఒక వర్గం కోలగట్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తే మరో వర్గం చిన్న శ్రీను ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది.

ఇటు కోలగట్ల, అటు చిన్న శ్రీను ఇరువురూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ జిల్లా స్థాయిలో ప్రతినిధ్యం వహిస్తున్నవారే.

పార్టీ వర్గంగా గమనించినట్లయితే ప్రారంభంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా కోలగట్ల కొనసాగిన్నప్పటికీ, ఆ తర్వాత పరిణామంలో ఆయన పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ గా కొనసాగుతున్నారు.

చిన్న శ్రీను మాత్రం పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాలు సమన్వయకర్త హోదాని కొనసాగిస్తున్నారు. ఎంతసేపూ చంద్రబాబుని విమర్శించడం తప్ప వీరు జిల్లా సమస్యలను ప్రస్తావించక పోవడం విశేషం.

జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి ఒకరున్నారు. రాష్ట్ర మంత్రిమరొకరున్నారు. అలాగే ఎమ్మెల్యేలున్నారు. అంతెందుకు విజయనగర పురిపాలన ఎప్పుడో అటకెక్కింది.

ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు. తాగునీరు ఎప్పుడిస్తారో తెలీదు. పారిశుధ్యం అంతంత మాత్రమే. రోడ్ల విస్తరణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. ఇది ఎమ్మెల్యేలు పురపాలన , ఇతర ప్రజాప్రతినిధులు పనితీరుకు నిదర్శనం కాదా?

ఈ విషయాలను ఎందుకు వీళ్లు ప్రస్తావించారు.
పార్టీ తరఫున ఏరోజైనా పురపాలక సంఘం ముందు సుదీర్ఘ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టడం, ప్రజా ఉద్యమాలను నిర్వహించడం ఎందుకు చేయరు.

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి కానీ, మంత్రి సుజయ్కృష్ణరంగారావు కానీ ఎందుకు టార్గెట్ చేయరు? వీరికి స్థానిక సమస్యలు పట్టవా? స్థానిక నాయకులను ప్రశ్నించారు…? వీరికస్సలు జిల్లాల్లో ఏం జరుగుతుందో తెలియదా…? ఈ రెండు వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కవలలు. ఒకరి ఏది చేస్తే మరొకరు అదే చూస్తారు.


ఆ పార్టీ కార్యకర్తలకు జిల్లా ప్రజలకు ఇప్పటికీ అలవాటైపోయింది. ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఎందుకుంటుంది. ఈ రెండు వర్గాల పార్టీ అధిష్టానాన్ని తూ.చా. తప్పకుండా పాటిస్తున్నాయి.

ఎవ్వరికి వారు పార్టీ అధిష్టానం మెప్పు పొందేందుకు పోటీలు పడి మరీ చంద్రబాబునాయుడు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం.

జిల్లా సమస్యలను, జిల్లా ప్రజా ప్రతినిధులు పనితీరుని జిల్లా ప్రజల అవసరాలను ఇరువర్గాల నాయకులు గాలికొదిలేసారు. దీనిని ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారన్నది మరో మూడు నెలల్లో తేలిపోతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *