లోకేష్కు అంత ధైర్యం ఉందా…?

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కోసం చాలా రోజులు నెల్లూరు అర్బన్ లో పని ప్రారంభించారు నారాయణ. ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉన్నా.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నారాయణకు చాలా సార్లు అయినా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడానికి ఛాన్సులున్నాయి అని చెప్పారు.

కానీ నారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఈ వయసులో ఆయనకు అంత అవసరం లేదు కాదా…! ఇక సోమిరెడ్డి విషయం లో మాటలు తప్ప చేతలు కనిపించవు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ ఎన్నికలను ఎదుర్కొనడానికి సై అంటున్నారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కొనడానికి సోమిరెడ్డి సిద్ధం అవుతున్నారు. తనను నాలుగు సార్లు ఓడించిన సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పోటీకి సిద్ధం కానున్నారు. ఈ ఎమ్మెల్సీ మంత్రుల హడావుడి చూస్తే. ఇక మనకు మంత్రి నారా లోకేష్ గుర్తుకు రాక మానదు.

నారాయణకు పొలిటికల్ కెరీర్ అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. సోమిరెడ్డి కెరీర్ పూర్తి కావొస్తోంది. అలాంటి వాళ్లే.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఎనలేని ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే రాజకీయమే కెరీర్ గా, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఉన్న నారా లోకేష్ లో మాత్రం ఏ ఉత్సాహం కనిపించకపోవడం గమనార్హం.

ఇప్పటి వరకూ నారా లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలీదు. .. సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవినే త్యాగం చేశారు. అయితే నారా లోకేష్ ఇప్పటి వరకూ తనకంటూ ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని పనీ మొదలుపెట్టలేదు, పార్టీలో స్ఫూర్తి నింపడానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చి. ఎన్నికలను ఎదుర్కొనడానికి సై అనడం లేదు!

ఇలా నారా లోకేష్ పొలిటికల్ కెరీర్ చాలా సైలెంట్ గా సాగుతోందని చెప్పుకోవాలి.తను మంత్రి కావడం అది ఒక పెద్ద విషయం అన్నట్లు భావిస్తున్నారు… ఇంతకీ  ఎమ్మెల్యే ఎప్పుడవుతారో, ఎక్కడ నుంచి అవుతారో! అసలు అవుతారో లేదో… అంత ధైర్యం ఉందో లేదు వేచి ..చూడవలసిందే.

Lokesh gave a counter on Jagan comments saying that Heritage was not built overnight like his did mentioning the awards that Heritage won for Corporate Governance Excellence and challenged Jangan for a debate. Now people are wondering if Jagan would take up the challenge of Lokesh. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *