నటరాజుకు నీరాజనం సౌజన్య నృత్యరూపకం


విశాఖపట్నం: అతిసూక్ష్మమైన భావాలను సునాయసంగా పలికించి , చక్కని హావభావాలతో
నృత్యాభినయం చేస్తూ నటరాజుకు సౌజన్య త్రివిక్రమ్ .

నీరాజనాలు అందించిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు.

మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సంగమం పౌండేషన్, కళావేదిక కల్చరల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి సౌజన్య త్రివిక్రమ్ నృత్య విభావరి నిర్వహించారు.

ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ పద్మా సుబ్రహ్మణ్యం నృత్య ప్రదర్శన చూస్తున్నప్పుడు ఎంతో గొప్ప అనుభూతి చెందానో అంతే అనుభూతిని ఈ నృత్యప్రదర్శనలో పొందానన్నారు.

ఈ నృత్యభినయం చూస్తుంటే రామాయణ, భాగవతం చూస్తూ, వింటున్న అనుభూతి కల్గిందని శ్లాఘించారు.


నృత్యాభినయం చూస్తూన్న ఆహుతులు, రసజ్ఞూలు మైమరిచి ఆనందడోలికల్లో విహారం చేసారు. మరెంతో పేరు ప్రఖ్యాతి పొందాలని సీతారామశాస్త్రి ఆశీర్వదించారు.

చక్కని సంభాషణతో, సంప్రదాయాలను పాటిస్తూ వెండి తెరపై త్రివిక్రమ్ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారన్నారం.

అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంప్రదాయ నృత్యాలను సాహాత్యాన్ని ఆదరించి వాటిని ప్రదర్శించే వారిని అభిమానిస్తే భావితరాలు అందిపుచ్చుకుని అనందించే అవకాశముందన్నారు.


ఆమె స్వయంకృషితో సంప్రదాయ కళలపై ఉన్న జిజ్ఞాసతో నృత్య కళాకారిణిగా మారిందని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలకు పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వామి కావడం ఆనందంగా వుందన్నారు.


శోభనాయుడు వంటి ప్రముఖ నృత్య కళాకారులు కళలకు జీవం పోయడానికి తన సర్వశక్తులు ధారపోస్తున్నారని కొనియాడారు.

సినిమారంగంలో తనను ఒక బండమనిషిగా పేరు తెచ్చుకున్న నన్ను ఇటువంటి ఇటువంటి నృత్యాభినయాలకు ఆహ్వానించడం చాలా ఆనందంగా వుందని ప్రముఖ నటుడు జయప్రకాష్ ఛలోక్తులు విసిరారు. తనకు బాల్యం నుంచి నాట్య రీతులన్న , నాటకాలన్నా, మక్కువ ఎక్కువని , శాస్త్రీయ నృత్యం రాకపోయినప్పటికీ వాటి ఆదరించే ఆసక్తి ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మురళీకృష్ణ, నండూరి రామకృష్ణ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు సిరివెన్నెలను , త్రివిక్రమ్ శ్రీనివాస్ , సౌజన్యలను ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *