పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి షాక్ ఇచ్చిన ఆలీ

Comedian Ali faces heat from Pawan fans

Comedian Ali faces heat from Pawan fans

ఆలీకి పవన్ కళ్యాణ్ కి ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసు. ఆలీ జనసేన లో చేరుతాడు అని అనుకున్న వాళ్లు. ఇప్పుడు ఆలీ జనసేన పార్టీ లో కాకుండా వేరే పార్టీలో చేరుతాడు అని అనుకుంటున్నారు.

కమెడియన్ ఆలీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండెట్ గా రంగం లోకి అడుగుపెడతాన్నాడు , అయితే ఆలీ, పవన్ కళ్యాణ్ కి షాక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యంలోకి గురిచేస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు పోటీలోకి దిగుతాను అని గత నాలుగేళ్లుగా చెబుతున్నారు ఆలీ .

2014లో జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ ప్రారంభించినప్పుడు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ అలీ మధ్య మంచి స్నేహం ఉంది ఎన్నో హిట్ సినిమాలు కలిసి నటించారు పవర్ స్టార్ సినిమా లో ఆలీ లేని చిత్రాలు చాలా తక్కువ.

పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన వచ్చే ఎన్నికల్లో 170 స్థానాల్లో పోటీ చేయనుంది కానీ ఈ పోటీలో ఎందుకు ఆలీ ఆసక్తి చూపించడం లేదు. ఆలీ త్వరలోనే వైఎస్సార్ పార్టీలో చేరబోతున్నట్లు ఆలీ మీడియా ప్రతినిధులకు చెప్పారు టీవీ9 సంప్రదించినప్పుడు కూడా ఈ వార్తని అతను అఫీషియల్గా చెప్పలేదు మరో రెండు మూడు రోజుల్లో చెప్తాను అని ఇండైరెక్టుగా ఈ విషయాన్ని అంగీకరించారు.

బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆలీ ఆ త్వరలోనే కమెడియన్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు ఆ పాపులారిటీతో హీరోగా మారాడు.

మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా మారాలి అనుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *