ఎన్టీఆర్ సన్నిహితులు, టీటీడీ మాజీ ఛైర్మన్ సీతారామయ్య ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆదివారం తుదిశ్వాస విడిచారు.

ఎన్టీఆర్ సన్నిహితులు, టీటీడీ మాజీ ఛైర్మన్ దేవినేని సీతారామయ్య కన్నుమూత
1986-89లో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆర్బీఐ ప్రాంతీయ బోర్డు డైరెక్టర్‌గా, హెరిటేజ్ ఫుడ్స్ ఛైర్మన్‌గా, విజ్ఞాన జ్యోతి సంస్థ వ్యవస్థాపకుడు, కోశాధికారిగా పనిచేశారు.
దుండిగల్ దగ్గర ఉన్న సేవాశ్రమం వృద్ధాశ్రమానికి ఛైర్మన్‌గా ఉన్నారు.
టీటీడీ మాజీ ఛైర్మన్, బ్రహ్మయ్య అండ్ కంపెనీలో సీనియర్ భాగస్వామి దేవినేని సీతారామయ్య కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సీతారామయ్య ఆదివారం తుదిశ్వాస విడిచారు.
సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. సీతారామయ్య మృతిపట్ల పలువురు ప్రముఖుల సంతాపం తెలియజేశారు.
దేవినేని సీతారామయ్య మృతికి చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితులని..
టీటీడీ ఛైర్మన్‌గా దేవినేని సీతారామయ్య సేవలు అందించారని.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సీతారామయ్య మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం ప్రకటించారు.
సీతారామయ్య తన మొదటి గురువని.. ఆయన గొప్ప తత్వవేత్త, మార్గదర్శి అన్నారు. తనను చాలా రకాలుగా సీతారామయ్య ప్రభావితం చేశారన్నారు.
సీతారామయ్య నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు గర్వంగా ఉందన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా దేవినేని సీతారామయ్య మృతిపై సంతాపం ప్రకటించారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
అన్నారు.
సీతారామయ్య స్వగ్రామం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు. సీతారామయ్య ప్రముఖ చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థ బ్రహ్మయ్య అండ్ కోలో గత అరవై ఏళ్లుగా భాగస్వామి.
కంకిపాడు మండలం పునాదిపాడులో సీతారామయ్య పాఠశాల విద్యాభ్యాసం జరిగింది. గుంటూరు బీకాం, సీఏ పూర్తి చేశారు.. 1986-89లో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు.
ఆర్బీఐ ప్రాంతీయ బోర్డు డైరెక్టర్‌గా, హెరిటేజ్ ఫుడ్స్ ఛైర్మన్‌గా, విజ్ఞాన జ్యోతి సంస్థ వ్యవస్థాపకుడు, కోశాధికారిగా పనిచేశారు.
దుండిగల్ దగ్గర ఉన్న సేవాశ్రమం వృద్ధాశ్రమానికి ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన కుమారుడు అమెరికాలో వైద్యుడు కాగా.. కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు.