ఉత్తరాంధ్రకు డిప్యూటీ సీఎం పదవి..ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది…ఆ ఇద్దరికే జగన్ ఛాన్స్..

డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బోస్ సీనియర్ కావడంతో.. మళ్లీ సీనియర్ నేతకే అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది.
ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. బుధవారం మధ్యాహ్నం కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కొత్త మంత్రులుగా అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి జోగి రమేష్, పొన్నాడ సతీష్‌లకు అవకాశం ఇస్తారని భావించినా సామాజిక వర్గాల కూర్పుతో వేణుగోపాలకృష్ణ, అప్పలరాజులను తీసుకోవాలని జగన్ భావించారట.
ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది.
పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. బోస్ సీనియర్ కావడంతో.. మళ్లీ సీనియర్ నేతకే అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రోడ్లు భవనాల మంత్రి ధర్మాన కృష్ణదా్‌సకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం నడుస్తోంది.
ఇక కొత్త మంత్రులు వేణుకు ఆర్‌అండ్‌బీ, అప్పలరాజుకు మత్స్యశాఖను అప్పగిస్తారని తెలుస్తోంది.
విస్తరణలో కూడా శాఖల మార్పిడి భారీగా ఉంటుందని.. కీలకంగా ఉన్న మంత్రుల శాఖలు మారతాయనే టాక్ వినిపిస్తోంది.
కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ శాఖల మార్పుపై బుధవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.