డేటా చోరీ కేసు.. ఏపీ కేబినెట్‌లో ఆసక్తికర చర్చలు…

తెలంగాణ ప్రభుత్వ తీరును తేలిగ్గా తీసుకోకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మంత్రులు..

సీనియర్ మంత్రులు, నేతలతో సమావేశమై యాక్షన్ ప్లాన్ రూపొందిద్దామన్న చంద్రబాబు.

1.తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీపై కొత్త వివాదం.
2.రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం.
3.డేటా చోరీ అంశంపై కేబినెట్ భేటిలో చర్చ.

డేటా చోరీ వ్యహారం రోజు రోజుకు ముదురుతోంది. వైసీపీ-టీడీపీల మధ్య మొదలైన వివాదం..

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య కొత్త వివాదాన్ని రాజేసింది.

ఏపీ డేటాను తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని ఏపీ సర్కార్ అంటుంటే..

ఏపీ సర్కార్ గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

తెలంగాణ పోలీసులు.. ఏపీ పోలీసులపై కేసులు నమోదు చేయడం.. పోలీసుల్ని అరెస్ట్ చేస్తామనడం ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీసింది. ఈ వ్యహారం ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది.

దాదాపు ఆరుగంటలకుపైగా కొనసాగిన ఏపీ కేబినెట్‌లో డేటా చోరీపై కీలక చర్చ జరిగిది.

ఈ అంశాన్ని మంత్రులు చంద్రబాబు దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఏపీ పోలీసులపై కేసుల అంశంపై చర్చ జరగ్గా.. తెలంగాణ మినహా పొరుగు రాష్ట్రాలతో ఏ ఇబ్బందులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారట. టీడీపీ డేటా దొంగిలించి ప్రత్యర్ధులకు అప్పగించి..

అది బయటపడేసరికి దానిని కప్పిపుచ్చుకునేందుకే ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారన్న ఓ మంత్రి ఆరోపించారట..

ఎవరో ఇచ్చిన ఫిర్యాదులతో ఒక రాష్ట్ర పోలీసులపై ఇంకో రాష్ట్ర పోలీసులు కేసులు పెడతారా అని మంత్రి సోమిరెడ్డి ప్రస్తావించారట.

మంత్రుల వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు.. ప్రతీ ఊరిలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పారదర్శకంగా వెల్లడిస్తోందని సీఎం అన్నారట.

డేటా చోరీ కేసుల వ్యవహరంపై దేశం అంతా దీనిపై చర్చ జరగాల్సి ఉందని..

హైకోర్టు చీవాట్లు పెట్టేసరికి ఫ్రస్ట్రేషన్‌తో సీపీ సజ్జనార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వ తీరును తేలిగ్గా తీసుకోకూడదన్ని అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేయగా.. సీనియర్ మంత్రులు, నేతలతో సమావేశమై యాక్షన్ ప్లాన్ రూపొందిద్దామన్న సీఎం సూచించారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *