టిడిపి కి మరో షాక్ వైసీపీలోకి దాసరి జెరమేష్

ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశంపార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీలోకి జంప్ లు చేస్తున్నారు, వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.

ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ,అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే టీడీపీకి మరో దెబ్బ తగిలింది. టీడీపీకి కీలక నేత, టిడిపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరు ఉన్న దాసరి జై రమేష్ వైసీపీలో చేరనున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన జగన్ ను కలవనున్నారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయనను పోటీకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి, దాసరి జై రమేష్ ప్రముఖ వ్యాపారవేత్త, విజయ ఎలక్ట్రానిక్స్ చైర్మన్.

విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆరు నెలలుగా ఆయన జగన్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ విషయమై ఆయన జగన్ తో జరిపిన చర్చలు ఫలించ డoతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం.

దాసరి జై రమేష్ ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితులు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటి, రమేష కీలకంగా వ్యవహరించే వారు. ఇటీవలనే దగ్గుబాటి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే, ఆయన కూడా వైసిపి లో చేరనున్నారు. దాసరి జై రమేష్ కూడా వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాలు టిడిపి శ్రేణుల్లో కొంత ఆవేదన నింపగా ,వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపియి. వైసీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం ,కొంతకాలంగా టిడిపి కి దూరంగా ఉంటున్న జై రమేష్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్న జగన్. టిడిపి నుండి వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. మరో 30 మంది నేతలు కూడా పార్టీ మారే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలవేళ సైకిల్ దిగే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

వైసీపీ నేతలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ అను పేరుతో టిడిపి నేతలకు వలవిసురుతున్నారు. మరి ఎన్నికల నాటికి ఇంకా ఫ్యాన్ గాలికి ఎంతమంది పడిపోతారో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *