కార్పొరేషన్ల ప్రకటన బూటకం అంటూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అసోసియేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నక్కెళ్ల నాగమణి

విశాఖపట్నం: జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలి. కార్పొరేషన్ ప్రకటన అనేది బూటకము. ఓట్ల కోసమే కార్పొరేషన్స ఏర్పాటని, వీటి వల్ల ప్రజలకు ఎటువంటి లబ్ధి చేయకూరదని. ఏపీ, ఎస్సీ‌ , ఎస్టీ , బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నక్కెళ్ల నాగమణి అన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను అభివృద్ధివైపు నడిపించాలంటే ఖచ్చితమైన బడ్జెట్ కేటాయించాలన్నారు.

ఒక గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని వచ్చి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి కేటాయించాలన్నారు. అప్పుడే నిజమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందన్నారు.

ఇప్పటికే ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ అనేక సంవత్సరాలుగా ఉన్నా వాటి ప్రయోజనాలు ఆ వర్గ ప్రజలకు ఏ మేరకు న్యాయం జరిగిందో చూస్తూనే ఉన్నా మని విమర్శించారు.


ప్రజలు బ్యాంకుల చుట్టు తిరగలేక, రాజకీయ దళారులను ప్రసన్నం చేసుకో లేక సతమత మవుతున్నారున్నారు.

ఈ నేపథ్యంలో వివిధ బీసీ కులాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన కార్పొరేషన్లు బీసీ ప్రయోజనం కంటే ఓట్లు ప్రయోజనాలే ముఖ్యమన్న విషయం తేటతెల్లమైందన్నారు.

తమ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకులకు ఓట్లు వేయడం ద్వారా మద్యం మాఫియా ధనం కలిగిన దోపిడీ వర్గాలకు గుణపాఠం నేర్పినట్టు అవుతుందని సూచించారు.

చౌకబారు తాయిలాల కోసం ఓట్లను నిరుపయోగం చేయవద్దని. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు, ప్రజాస్వామ్య అభ్యుదయ వాదులకు మహిళలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *