ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపణ

చంద్రబాబును కేసులో ఇరికించే ప్రయత్నం…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారులు వరసగా రెండో రోజు విచారించారు. రేవంత్‌ను రెండు రోజుల పాటు వివిధ కోణాల్లో సుదీర్ఘంగా విచారించారు.

ఈడీ విచారణ అనంతరం బుధవారం (ఫిబ్రవరి 20) సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.

అడిగిందే అడుగుతూ ఈడీ అధికారులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.

అధికారులు వేసిన ప్రశ్నలు చూస్తుంటే కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

ఏసీపీ పెట్టిన కేసు పైన ఈడీ అధికారులు తనను విచారించారని రేవంత్ తెలిపారు.

గతంలో ఇదే కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసినా ఆరోపణలు అన్నింటినీ హైకోర్టు తప్పుపట్టిందన్నారు.

కానీ, ఇప్పుడు ఈడీ ద్వారా తనను, చంద్రబాబును ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్, మోదీ ఒత్తిడితోనే..
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఒత్తిడితోనే ఈడీ అధికారులు పని చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోందన్నారు

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హైకోర్టు కొట్టి వేసిన కేసును తిరగదోడుతున్నారని అన్నారు. కేసీఆర్‌, మోదీ..

ఇద్దరిదీ ఫెవికాల్‌ బంధమని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *