రాజకీయ తీర్థం పుచ్చుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ…

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం చాలా సర్వసాధారణమైన విషయం. ఆ కోవకు చెందిన మరో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి..గత కొంత కాలంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో మింగిల్ అయిన విషయం మన అందరికీ తెలుసు… ఈ మేరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా వృద్ధి కాస్త హడావిడి చేశారు. జగన్ తో కలిసి పాదయాత్ర చేశారు. వైయస్ఆర్సీపీ భావజాలాన్ని కొన్ని సందర్భాల్లో గట్టిగా వినిపించారు కూడా.

మొన్నటి వరకు తను వైయస్సార్సీపి మనిషినని.. ఎన్నికల్లో తాను పోటీ చేయడం చెప్పారు… కానీ 2019 ఎన్నికల్లో తన పాత్రను పోషించుకుంటున్నాడు. వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం కల్పించారు వైఎస్ జగన్. ఇప్పటి నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి రాజకీయ రంగంలోకి దిగి హడావిడి చేయడం ఖాయం.

అన్ని విషయాల మీద పరిజ్ఞానం తో,మనిషి మాట్లాడగలిగే సత్తాను చాటుకున్నారు ఇప్పటికే మన పృద్వి… అధికారపక్షంపై ఇప్పటికే చాలా ఘాటైన విమర్శలు కూడా చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ తరఫున తన సత్తా ను ఇప్పటికే చూపించారు. ఇకముందు రాజకీయ వేదిక పై కూడా వృద్ధి చాతుర్యాన్ని మనం చూడబోతున్నాం.

ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో 30 ఇయర్స్ సేవలు పార్టీకి అవసరమని భావించిన జగన్ పృద్వి పార్టీలో మంచి స్థానాన్ని కల్పించాలని వైఎస్ఆర్ సిపి వర్గాలు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా, పృథ్వి కి ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారానికి సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, వైఎస్ఆర్సిపి కి నమ్మకంగా ఉన్న మరో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి సైతం ఓ మంచి స్థానాన్ని ఇవ్వాలని వైసీపీ జగన్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పోసాని మాత్రం వైస్సార్సీపీకి బయటనుంచే మద్దతిస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *