ఏపీ ఎన్నికల్లో గెలుపు తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ జగన్ క్రేజ్ పెరిగింది…

సోషల్ మీడియాలో జగన్ క్రేజ్.. నెటిజన్లకు ఏపీ సీఎం ధన్యవాదాలు
ఏపీ ఎన్నికల్లో గెలుపు తర్వాత వైఎస్ జగన్ క్రేజ్ పెరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు ట్విట్టర్‌లో ఫాలోవర్లు సంఖ్య 1 మిలియన్ దాటింది. టు ఫేస్‌బుక్‌లో అయితే 1.8 మిలియన్లకు చేరింది.
1.సోషల్ మీడియా వారియర్లకు జగన్ ధన్యవాదాలు
2.వైసీపీ గెలుపులో కీలకపాత్ర పోషించారని కితాబు
3.ఈ మద్దతు ఇలాగే కొనసాగించాలని ఆకాంక్ష
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
పాలనలోనూ దూసుకెళుతున్న జగన్.. తన మార్క్ చూపిస్తున్నారు. అధికారుల బదిలీలతో మరింత పట్టు సాధించే పనిలో ఉన్నారు.
చకా, చకా మంత్రివర్గ కూర్పును పూర్తి చేసి.. అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నారు.
అయితే ఎన్నికల్లో వైసీపీ తరపున సోషల్ మీడియాలో పోరాడిన నెటిజన్లకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
వైసీపీ కోసం పోరాడి.. ఎల్లో మీడియా అసత్య ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ ప్రశంసలు కురిపించారు.
జగన్ తన ట్వీట్‌లో ‘నేను రాష్ట్ర బాధ్యతలు స్వీకరించడానికి సహకరించిన సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు.. ఎల్లో మీడియాతో పోరాటం చేశారు.
పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు.. మీ మద్దతు ఎప్పుడూ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను.
మరోవైపు ఏపీ ఎన్నికల్లో గెలుపు తర్వాత వైఎస్ జగన్ క్రేజ్ పెరిగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు ట్విట్టర్‌లో ఫాలోవర్లు సంఖ్య 1 మిలియన్ దాటింది.
ఇటు వైసీపీ ట్విట్టర్ అకౌంట్‌తో పాటూ అనుబంధ అకౌంట్లకు కూడా ఫోలోవర్ల సంఖ్య భారీగానే పెరిగింది. ఇటు ఫేస్‌బుక్‌లో అయితే 1.8 మిలియన్లకు చేరింది.