ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి పై నిర్ణయం ఇండియా టుడే కాన్ క్లేవ్ లో సీఎం చంద్రబాబు

CM Chandrababu to Announce MLA Candidates List for AP
ప్రతిపక్షాల తరుపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరన్నది లోకసభ ఎన్నికల తర్వాతే నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తూ డీఎంకే చీఫ్ సాల్టన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. విశాఖపట్నం వేదికగా శనివారం జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ ల్ సీఎం పాల్గొని మాట్లాడారు. మహా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఎవరికి మద్దతిసారన్న దాని పై స్పందిస్తూ “ఎన్నికల తర్వాత నా నిర్ణయం వెల్లడిస్తాను. ఇప్పటికిప్పుడే మేము దానిపై మాట్లాడకూడదు ఈ అంశంపై మేమంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ” అని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ కు మద్దత ఇస్తున్నట్టు ఇటీవల ఎంకే స్టాలిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా శనివారం జరిగిన కాన్ క్లేవ్ లో ఎన్డీయే ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర రాజకీయాలు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు సహాపలు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా మాట్లాడారు ప్రత్యేక హోదా సహా ఆంధ్రప్రదేశ్కు దక్కవలసిన విభజన హామీలను ఎన్డీయ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నందుకు నిరసనగా చంద్రబాబు సారధ్యంలో ని తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగిన సంగతి తెలుసిందే.
కేసీఆర్ కు ఘన స్వాగతం విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు పెందుర్తి శారదా పీఠం వరకు స్వాగత సత్కారాలు శ్రీ రాజశ్యామలాదేవి ఆలయ ప్రత్యేక పూజలు. భారీ కటౌట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ పర్యటన నేపథ్యంలో శారదాపీఠం వద్ద కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ మార్గం లో భారీగా పోలీసులు ను మొహరించారు. తెలంగాణా పోలీసులు కూడా శారదాపీఠం వద్ద బందోబస్తు నిర్వస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆశ్రమంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ విశాఖ కు వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ… విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వేళ్లే మార్గంలో భారీ కటౌట్లు వెలిశాయి. ఈ మార్గంలో వెలిసిన కేసీఆర్ కటౌట్లు పులువురు దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత తన తొలి పర్యటన కె. చంద్రశేఖర రావు ఆదివారం విశాఖపట్నం నగరానికి విచ్చేశారు ప్రత్యేక ఎయిరిండియా విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో కేసీఆర్ సకుటుంబ సపరివార సమేతంగా విశాఖకు విచ్చేశారు. అక్కడ నుండి పెందుర్తి లోని శ్రీ శారద పీఠానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ కేసీఆర్ ప్రత్యేక కాన్వాయ్ లో శారద పీఠానికి చేరుకున్నారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానం దేంద్రస్వామి వేద మంత్రాలతో పూర్ణకుంభంతో కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు అక్కడ శ్రీ రాజశ్యామలాదేవి ఆలయంలో కేసీఆర్ చేత సర్వపానంద స్వామి,ఇతర వేదపండితులు ప్రత్యేక పూజలు చేయించారు.
శారదా పీఠం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం 4:30 గంటలకు ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం 6 గంటలకు ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అవుతారు. ఈ రోజు రాత్రి అక్కడ బస్సు చేస్తారు. 24వ తేది ఉదయం కోణర్క్ సూర్య దేవాలయం పూరి జగన్నాథ్ స
24వ తేదీ ఉదయం కోణార్క్ సూర్యదేవాలయం, పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శింస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. తర్వాత అక్కడి కోల్కతా వెళ్తరు. 24 వ తేదీ సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు రాత్రి ఢిల్లీ వెళ్తారు 25 నుంచి రెండు మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ లోనే ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో నే బీఎస్పీ అధ్యక్షురాలు…