గుజరాత్ బెల్లమే బాబుకి రుచి చంద్రన్న కానుకకు మోడీ సరుకు

తెల్లారిలేస్తే ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడమే కాదు, గుజరాత్ పైన సైతం విరుచుకుపడే ముఖ్యమంత్రి చంద్రబాబు కు అక్కడ బెల్లం మాత్రం బాగా నచ్చేసింది. సంక్రాంతికి చంద్రన్న కానుక పేరట తెల్ల రేషన్ కార్డుదారులకు ఇస్తున్న సరుకుల్లో బెల్లాన్ని గుజరాత్ నుంచి బెత్తాయించి తెప్పించడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఏపీలో ఎక్కడ బెల్లం లేనట్లుగా పనిగట్టుకొని మరీ గుజరాత్ బెల్లం దిగుమతి చేసుకోవడం వెనుక మతలబు ఏంటని విపక్షాలు మెగా తీస్తున్నాయి. మోడీ చుట్టూ గుజరాత్ మనుషులే ఉన్నారని అభివృద్ధికి కేంద్ర నిధులు అక్కడే ఖర్చు పెడుతుందని నానా యాగీ చేసే చంద్రబాబు ఏపీ నిధులను సైతం గుజరాతి దోచిపెట్టడంలోని ఆంతర్యం ఏమిటని గుస్సా అవుతున్నారు. ఏపీలోఅనకాపల్లి బెల్లానికి నంబర వన్ స్థానం ఉందని. ఇక్కడ బెల్లం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు వెన్నుదన్నుగా ఉండవలసిన ప్రభుత్వం ఖజానా సొమ్మును వేరే రాష్ట్రానికి ఖర్చు చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు.

దీనిమీద విశాఖ జిల్లా జనసేన పార్టీ భగ్గుమంటోంది. అచ్చితపురం మండలం కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సుందరపు విజయ్ కుమార్. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న సరుకులు నిమిత్తం గుజరాత్ రాష్ట్రం నుంచి బెల్లం రప్పించి పంపిణీ చేయడం దౌర్భాగ్యమని విమర్శించారు.

అనకాపల్లి ప్రసిద్ధిచెందిన బెల్లం తయారీ లో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉండగా అనకాపల్లి మార్కెట్లో బెల్లం కొనుగోలు చేయకుండా పొరుగు రాష్ట్రం నుంచి బెల్లం రప్పించడం ఏంటని ప్రశ్నించారు.

అనకాపల్లికి చెందిన రైతులు వివిధ ప్రాంతాల నుంచి బెల్లం తయారై అనకాపల్లి మార్కెట్ లో అతి తక్కువ ధరలకు అందిస్తున్న అనకాపల్లి బెల్లం మార్కెట్ వదిలేసి ముఖ్యమంత్రి గుజరాత్ లో కొనుగోలు చేయడం ప్రజలకు తీరని లోటని ఆయన అన్నారు.

ఈ విషయంలో ప్రజలు రైతుకుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారని రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉందని. కనీస బాధ్యతను కూడా విస్మరించడం దారుణమని అన్నారు. అనకాపల్లి బెల్లం రైతులను ఆదుకోకపోతే జనసేన పార్టీ తరపున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మొత్తానికి మోడీతో ఫైటింగ్ చేస్తున్నట్లు గా ఫోజులు పెడుతున్నా చంద్రబాబుకు గుజరాత్ రాష్ట్రం అంటే చాలా తీపి అని బెల్లం సాక్షిగా రుజువైపోయిందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *