అభ్యర్థులను ముందే ప్రకటిస్తాం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు:

CM Chandrababu to Announce MLA Candidates List for AP

CM Chandrababu to Announce MLA Candidates List for AP

అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గెలుపు ఏకపక్షం కావాలని ఆకాంక్షించారు. ‘ మళ్లీ టీడీపీ రావాలి’ అనే నినాదం మార్మోగాలని మళ్లీ రాకుంటే అభివృద్ధి ఆగిపోయి, పేదల సంక్షేమం నిలిచిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు పార్టీ నేతలతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు ప్రజాప్రతినిధులు పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ. ఎక్కడా భేషజాలకు పోకూడదని, గ్రూపు విభేదాలు విడనాడాలని హితవు పలికారు . అన్ని అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఆధిక్యత భారీగా పెరగాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలోనూ సెమీ క్రిస్మస్ వేడుకగా జరపాలి ఈనెల 30న జయహో ‘ బీసీ ‘ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరభారతా మూడు రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ గెలవకలేక పోయిందని, ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.

రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే గెలిచాయని , దేశం మొత్తం మోడీ పాలనను తిరస్కరిస్తోందని వెల్లడించారు. ఏపీ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లో అశాంతి నెలకొందని, మైనారిటీల్లో అభద్రత పెరిగిందిన్నారు. దేశంలో మూడో కూటమికి ఉనికే లేదని. అది బీజేపీకి దొడ్డిదారిని మేలు చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేడ్చల్ లో సోనియా చెప్పినం దుకే దాన్ని సాకుగా చూపి కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టారని చంద్రబాబు అన్నారు. తొలుత హోదాకు అంగీకరించిన టీఆర్ఎస్ మళ్ళీ అడ్డం తిరిగడాన్ని తప్పు పట్టారు. తెలంగాణలో 

తెలంగాణలో తెరాస గెలిస్తే ఇక్కడ ప్రతిపక్ష నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, వైసీపీ నేతలకు పండగల ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ కు ఎప్పుడు ఒవైసీ స్నేహితుడయ్యాడు అని ప్రశ్నించారు వీళ్ళ కోసం స్వప్రయోజనాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *