లైన్ క్లియర్..జగన్ సర్కార్ ముందున్న పెద్ద టాస్క్ .. చంద్రబాబు ఆశ కూడా అదే!

మూడు రాజధానులకు గవర్నర్ లైన్ క్లియర్ చేసేశారు. ఇప్పుడు జగన్ సర్కార్ ముందున్న పెద్ద టాస్క్ అదేనా.. చంద్రబాబు కూడా ఆ అంశంపైనే ఆశలు పెట్టుకున్నారా.. మరి ఈ చిక్కుముడిని దాటేందుకు ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుంది.

కేంద్రం ఏమంటుంది.. సుప్రీంకోర్టు ఓకే చెబుతుందా..

ఏపీ మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర తెలిపారు. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు బిశ్వభూషణ్ హరిచందన్ లైన్ క్లియర్ చేశారు.

రాష్ట్రంలో ఇకపై పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు.. శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి ఉంటుంది.

ఇక అధికారికంగా మూడు రాజధానులు కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు.

రాష్ట్రంలో అధికారికంగా మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయి. మూడు రాజధానులు అంటే పరిపాలనా రాజధాని విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్, సెక్రటేరియట్ ఉంటాయి.

అలాగే న్యాయ రాజధానిగా ఉన్న కర్నూలులో కోర్టులు, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన కార్యాలయాలు.. ఇక లెజిస్లేచర్ కేపిటల్‌ అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది.

మూడు రాజధానుల ముచ్చట అలా ఉంటే.. ఇప్పుడు జగన్ సర్కార్ ముందు ఓ చిక్కు ముడి ఉందనే చెప్పాలి. దానిని ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారగా.. చంద్రబాబు, టీడీపీ, అమరావతి రైతుల ఆశలు కూడా ఆ అంశంపైనే ఉంది.

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు చక, చకా

గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానుల దిశగా జగన్ సర్కార్ చక, చకా అడుగులు ముందుకు వేస్తోంది.

వెంటనే మూడు రాజధానులు అమల్లోకి వచ్చినట్లు ఆర్డర్స్ తీసుకొచ్చింది. ఏపీ రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారు చేసేసిందట.

దేశ స్వాత్రంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి భూమి పూజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు కూడా విశాఖ నగరంలోనే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. దశలవారీగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ అక్కడికి తరలించనున్నారు.

అంటే మూడు రాజధానుల విషయంలో పట్టుదలతో ఉన్న జగన్ సర్కార్ ముందు పరిపాలనా రాజధానిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సీఎంవో అధికారులు, డీజీపీ కూడా అక్కడ పర్యటించారు.. అక్కడి పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చారు.

కర్నూలకు హైకోర్టు తరలింపుపై చిక్కుముడి

ఇప్పుడు జ్యుడీషియల్ రాజధాని విషయంలోనే జగన్ సర్కార్‌కు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

అంతా అనుకున్నట్టుగా జరిగితే హైకోర్టును కర్నూలుకు మార్చడం అంత సులభం కాదు.. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పడాలి.. హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి.. ఇలా చాలా చిక్కు ముడులు ఉన్నాయి.

వీటిని ఎలా అధిగమిస్తుందన్ని ఆసక్తికరమే. హైకోర్టు తరలింపునకు కేంద్రం ఓకే చెబుతుందా లేదా అనేది ఆసక్తికర అంశం.

ఒకవేళ నో చెబితే జగన్ సర్కార్ ముందు ఉన్న ఆప్షన్ హైకోర్టు బెంచ్.. అంటే హైకోర్టు అక్కడే కొనసాగుతుంది.. బెంచ్ మాత్రమే కర్నూలులో ఉంటుంది. లేదు హైకోర్టు తరలింపునకు ఓకే చెబితే ఎలాంటి సమస్య ఉండదు.

చంద్రబాబు ఆశలు కూడా దానిపైనే

టీడీపీ, అమరావతి రైతులు, చంద్రబాబు ఆశలు కూడా హైకోర్టుపైనే ఉందని చెప్పాలి.

హైకోర్టును తరలించడం అంత సులభం కాదని.. విశాఖకు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలను తరలించే అవకాశం ఉంటుంది అంటున్నారు.

అంతేకాదు గవర్నర్ రాజధాని బిల్లులకు ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్దమనే వాదనను తెరపైకి తెస్తున్నారు.

ఈ బిల్లులను తీసుకొచ్చి విభజన చట్టానికి చిల్లులు పొడిచారంటున్నారు. అంతేకాదు సెలక్ట్ కమిటీ.. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ ఉన్న సమయంలో బిల్లులకు ఆమోదం ఎలా తెలుపుతారని ప్రశ్నిస్తున్నారు.

న్యాయ స్థానాలపై తమకు నమ్మకం ఉందని.. తప్పకుండా అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఉన్నారు.

కాబట్టి హైకోర్టు తరలింపు అంశం ఆషామాషీ విషయం కాదంటోంది టీడీపీ.

జగన్ సర్కార్ ఆశ కూడా కేంద్రపైనే ఉన్నాయా!

హైకోర్టు తరలింపు విషయంలో జగన్ సర్కార్ ఆశలు కూడా కేంద్రంపైనే ఉన్నాయి. కోర్టును తరలించాలంటే.. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పడాలి.. హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి.. ముందు కేంద్ర పరిధిలో అడ్డంకులు తొలగితే.. తర్వాత సుప్రీం, హైకోర్టులు వరకు రావొచ్చు. మరి కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందా అన్నది కూడా కీలకమే. కేంద్రం ఓకే చెప్పినా.. తర్వాత కోర్టులు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరం. రాష్ట్ర విజన తర్వాత హైకోర్టును హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు.. ఇప్పుడు మళ్లీ అమరావతి నుంచి కర్నూలుకు తరలించాల్సి ఉంటుంది.. కాబట్టి సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఎలా పరిగణిస్తుందన్నది కీలకం. అందుకే జగన్ సర్కార్ హైకోర్టు బెంచ్ దిశగా అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *