RSS చీఫ్ భగవత్ ను నాగపూర్ వెళ్లి రహస్యంగా కలిసిన బాబు

Chandrababu Changes Colours Like Chameleon
మో ‘ఢీ’ తో ‘ఢీ’ ,మోడీ హటావో దేశ్ కో బచావో
వంద మంది మోడీలు వచ్చినా నన్ను ఏమి చేయలేరు, మోడీ లాంటి దుర్మార్గుడు సిబిఐ ED ఇన్కమ్ టాక్స్ లను ఉపయోగించి మాపై దాడులు చేస్తున్నాడు అని ఎన్నికలకు ముందు AP ప్రభుత్వ డబ్బుతో దేశమంతా తిరిగి అందరి సంకలు ఎత్తి అదేనండి చేతులు పైకెత్తి హడావిడి చేసి ఓడిపోగానే సొంత కులస్థులైన టీడీపీ నాయకులు సుజనా చౌదరి , గరికపాటి చౌదరి, లంక దినకర్ చౌదరి, వరదాపురం సూరి చౌదరి లను BJP లోకి పంపి ,నా మీద అవినీతి కేసులు రాకుండా రక్షణ వలయం లా ఉండి నన్ను కాపాడండి అని చెప్పి , బీజేపీ తో విడిపోయి తప్పు చేశా, నాకు మోడీకి విభేదాలు లేవు అంటూ ప్రేమ లేఖలు పంపి ,ఇటీవలే తన తరపున (చంద్ర ) జ్యోతి MD రాధాకృష్ణ చౌదరి ని అమిత్ షా దగ్గరికి రాయబారానికి పంపి కాకా పట్టాలని చూసిన బాబు , రహస్యంగా వెళ్లి BJP కి వెన్నుముక అయిన RSS చీఫ్ భగవత్ ను చీకటిలో కలవడం అంటే , 2011 లో తన మీద ఉన్న అవినీతి కేసుల నుంచి కాపాడమని ఢిల్లీ వెళ్లిరహస్యంగా అంటి కాంగ్రెస్ కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం ను కలిసిన విషయం గుర్తుకు వస్తోంది.
(కేసుల భయం తో ఢిల్లీ వెళ్లి సుజనా చౌదరి గెస్ట్ హౌస్ లో చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు బాబు -కెసిఆర్
నన్ను మీ నాయకుడు వచ్చి రహస్యంగా ఎందుకు కలిసారో చెప్పమంటావా అని నిండు పార్లమెంటులో చిదంబరం అంటే టపీమని కూర్చున్న నాటి టీడీపీ పార్లమెంటు నాయకుడు నామా చౌదరి)
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు రెండు కళ్ళ , రెండు కాళ్ల సిద్ధాంతం తో కేసులు రాకుండా బ్రతుకీడుస్తున్నాడు చీకటి చంద్రుడు .
SOURCE: RSS చీఫ్ భగవత్ ను నాగపూర్ వెళ్లి రహస్యంగా కలిసిన బాబు -ప్రజాశక్తి, Nov 1 , 2019