వైసిపి నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్

21 మంది లొ ఐదుగురికి మళ్లీ అవకాశం, నలుగురు మంత్రులో ఇద్దరికీ చాన్స్. ఆదినారాయణ రెడ్డికి బలవంతంగా కడప ఎంపీ స్థానం అంటగట్టిన చంద్రబాబు.
సుజయకృష్ణ ను పక్కన పెట్టి మరోకరి పేరును తెరపైకి తెచ్చిన వైనం. మిగిలిన 14 మందికి సీట్లు ఇవ్వాలెన ని అని తెగేసి చెప్పిన టిడిపి అధినేత, తమ భవిష్యత్తు నాశనం చేశారు అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గగ్గోలు.
చంద్రబాబు యూజ్ అండ్ త్రో విధానానికి బలైపోయామని వాపోతున్నారు.
గతంలోనూ హరికృష్ణ తోడల్లుడు, దగ్గుబాటి, ఇదే పరిస్థితి మోహన్ బాబు, దాసరి జై రమేష్ వంటి వారిని వాడుకుని వదిలేసిన బాబు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపీఠం ఎక్కించడం లోని సిద్ధహస్తుడు గా పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు.
ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ సర్వేలో వెనుకబడిపోయారు అంటూ రకరకాల సాకులతో వారికి మొండిచేయి చూపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ను ఇవ్వలేను అని తెగేసి చెప్పేశారు.
21మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలొబాలు పెట్టి టిడిపిలో చేర్చుకున్న విషయం తెలిసిందే.
భూమా నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు మృతిచెందగా మిగిలిన ఇరవై ఒక్కమంది టిడిపిలో కొనసాగుతున్నారు ,వారు నలుగురికి ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే ఇప్పుడు వారందరి పరిస్థితి తలకిందులైంది.
తన రాజకీయ అవసరాలకోసం వాడుకోవడం, పని పూర్తయిన వారిని పక్కన పడేయడం లో చంద్రబాబు దిట్ట అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దీనికి సంబంధించి పలు ఉదాంతలను వారు ఉదహరిస్తున్నారు.
ఎన్టీఆర్ ను గద్దె దించేందుకు ఏకంగా ఆయన కుమారుడు తన బావమరిది నందమూరి హరికృష్ణను చంద్రబాబు ఉపయోగించుకోవడం ఆ తర్వాత అవమానాలకు గురిచేయడని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
అంతెందుకు ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం హరికృష్ణ కుమార్తె సుహాసిని ఓడిపోతామని తెలిసి కూడా రంగంలోకి దించి బలిపశువును చేశారనే ఆవేదన టిడిపి నాయకులో నే వ్యక్తమైంది.
చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరావు, మోహన్ బాబు యూజ్ అండ్ త్రో విధానానికి బలైన వారే.
ఇప్పుడు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన మెజార్టీ ఎమ్మెల్యేలు బాబు చక్రబంధంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారని టిడిపి నేతలే చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యేలు బాబు చక్రబంధంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారని టిడిపి నేతలే చర్చించుకుంటున్నారు.
వైయస్సార్సీపి ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో వీరందరికీ 30 కోట్ల పైగా డబ్బులు ఇవ్వడంతోపాటు ,కాంట్రాక్టులు ఇస్తామని, వీలైతే మంత్రి పదవి లేకపోతే ఇతర పదవులు ఇస్తామని ప్రలోభాలు పెట్టి టిడిపిలో చేర్చుకున్నారు.
మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా కల్పిస్తామని ఆ సమయంలో చంద్రబాబు వీరికి హామీ ఇచ్చారు.
చంద్రబాబును నమ్మి పూర్తిగా మోసపోయామని తమను ఆయన కరివేపాకులా పక్కన పడేశారు.
ఫిరాయింపుఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద అంటున్నారు. తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది అని నెత్తి నోరు బాదుకుంటున్నారు.