చంద్రన్న: అమరావతిని రాజధానిగా ఎంపిక!

అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడు చంద్రన్న ఎవరినీ సంప్రదించలేదు. గౌరవించాల్సిన నివేదికలను అయన పట్టించు కోలేదు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసారు. రాష్ట్రం నిధుల్ని అక్కడికే తరలించారు. ఇవన్నీ ఆమోదయోగ్యమైన చర్యలతే ఆ బాబు గారినే ప్రజలు మళ్ళీ గద్దెనెక్కించే వారు కదా ! ఆయనను దించేశారు కదా ! దించడం కాదు, నువ్వొద్దు బాబూ అని చెప్పారు.

ఇప్పుడు జగన్ అమరావతి ని రాజధానిగా కొనసాగిస్తారా ? చంద్రన్న కోతలు కోసినంత గొప్పగా రాష్ట్రం నిధులన్నీ కొల్లగొట్టి అక్కడకి తరలించి కళ్ళుతిరిగే రాజధానిని జగన్ కడతారా ? అసలెందుకు కట్టాలి ? ఆలా కట్టాలి అనేది జనాభిప్రాయం కాదు. కాబట్టి జగన్ ప్రభుత్వం తప్పక రాజధాని వ్యవహారాన్ని పునఃపరిశీలించాలి. వరదలొచ్చి రాజధాని ప్రాంతం మునిగిపోవడం ఒక timely alert. దాని నుంచి పాఠం నేర్చుకోవాలని ఒక మంత్రి చెబితే, అయన వ్యాఖ్యల్ని వివాదాస్పదం చేసిందెవరు ?

  1. చంద్రబాబు అనుకూల మీడియా
  2. రాజధాని ప్రాంతంలో భూముల్ని కొట్టేసిన రాబందులు
  3. జగన్ రాజకీయ ప్రత్యర్థులు
  4. ప్రజలు తిరస్కరించిన సినీ నటులే కదా !

వీళ్లప అభిప్రాయాలకు ఎందుకు గౌరవం ఇవ్వాలి ? ప్రపంచాన్ని లెక్క పెట్టకుండా జగన్ చేయాల్సింది ఒకటే ! చారిత్రక దృష్టితో, పర్యావరణ దృష్టితో రాజధాని అంశాన్ని పరిశీలించాలి. అవసరం అయితే ఇంకో కమిషన్ వెయ్యాలి. లేదా శివరామ కృష్ణ కమిషన్ సిఫారసుల్ని పరిగణన లోకి తీసుకోవాలి. అంతేకానీ, లాబీయిస్టుల, బోగస్ మీడియా ఉడుత చప్పుళ్లను లెక్కలో పెట్టాల్సిన పని లేదు.

బహుశా, ఈ క్రింది ఆలోచనలు పరిశీలనకు యోగ్యమైనవి ఏమో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి :

  1. చంద్రబాబు & కంపెనీ ఆలోచనల మేరకు రాజధానిని కట్టకూడదు, ఎందుకంటె అది దోచి పెట్టె వ్యవహారం కాకూడదు.
  2. రాజధానికోసం భూములిచ్చిన రైతులెవరూ త్యాగయ్యలు అన్న సెంటిమెంట్ అక్కర్లేదు.
  3. అమరావతి లో పరిమితమైన రాజధాని మాత్రమే కట్టాలి. రెండవ మూడవ రాజధానులుగా రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్ర లో మరోటి ఎంపిక చేయాలి.
  4. దొనకొండనో, మరొకదాన్నో ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక కేంద్రం గా అభివృద్ధి చేయాలి.
  5. శాఖల ప్రధాన కార్యాలయాల్ని కొన్ని కొన్ని – జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న కమ్యూనికేషన్, డిజిటల్ ప్రపంచంలో అన్నే ఒకేచోట ఏడవాల్సిన పని లేదు.
  6. రాష్ట్రంలో ఇప్పుడే పరిశ్రమలు వున్న నియోజకవర్గాలు కాక, మిగతా నియోజక వర్గాల్లో ప్రతీ నియోజక వర్గంలో కనీసం 5 వేలమందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.

— రివర్స్ టెండరింగ్ వద్దని, తప్పని అత్యున్నత కోర్టులు నిర్దిష్టంగా చెబితే తప్ప అవినీతిని కనీస స్థాయికి తగ్గించేందుకు ఏ చర్యలైన చేబట్టే అధికారం ఒక ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుంది, వెనకంజ వేయాల్సిన అవసరం లేదు !

— స్వేచ్ఛగా దోచుకున్న మాజీ పాలకులకు, వాళ్ళ మాఫియా బృందానికి – నిజాయితీగా పనిచేద్దాం, ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుందాం అని ప్రయత్నిస్తున్న జగన్ తల వొగ్గాల్సిన పనిలేదు !

జగన్ ముందుకే అడుగేసాడు ! అందుకే ఇంత దూరం వచ్చాడు ! తన ముందడుగులే తనకు శ్రీరామ రక్ష !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *