చంద్రబాబు నాయుడు అక్రమ నిర్మాణానికి ఒక నిలువెత్తు నిదర్శనం

ముంపుకు చంద్రబాబు నివాసం… వస్తువులు పై అంతస్తుకు…పదేళ్ల తర్వాత కృష్ణమ్మ ఉగ్రరూపం…. కరకట్ట అక్రమ కట్టడం దారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేశారు.

చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ప్రకృతియే నిరూపించింది. ఇది చంద్రబాబు నాయుడు అక్రమ నిర్మాణానికి ఒక నిలువెత్తు నిదర్శనం.

పులిచింతల నుంచి ఏడున్నర లక్షల క్యూసెక్కుల ప్రవాహం ప్రకాశం బ్యారేజ్‌కు వస్తోంది. దాంతో 70 గేట్లు ఎత్తి బ్యారేజ్ నుంచి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.పశ్చిమ కనుమల్లో ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండడంతో ప్రవాహం తీవ్రత మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. కొద్దిరోజుల్లోనే ప్రకాశం బ్యారేజ్ వద్దకు ప్రవాహం రెట్టింపు కావొచ్చు అని చెబుతున్నారు.

ఇప్పటి వరదే కృష్ణ కరకట్టను కృష్ణమ్మ తాకబోతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్రమ నిర్మాణ దారులను అప్రమత్తం చేశారు. కరకట్టపై అక్రమంగా నిర్మించిన పలు ఆశ్రమాల్లో ఉంటున్న వారిని తరలిస్తున్నారు.చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని భవనాన్ని కూడా కృష్ణమ్మ తాకుతూ ప్రవహిస్తోంది.

దాంతో చంద్రబాబునాయుడు హైదరాబాద్ వెళ్లిపోయారు. చేతి గాయం కారణంగా విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతోనే ఆయన హైదరాబాద్ వెళ్లారని టీడీపీ నేతలు చెబుతున్నారు.లింగమనేని భవనాన్ని వరద తాకడం ఖాయమైపోవడంతో చంద్రబాబు కాన్వాయ్‌ని అక్కడి నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌కు తరలించారు. లింగమనేని భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న వస్తువులను మొదటి అంతస్తుపైకి చేర్చారు.

జగన్ మాట వింటే చంద్రబాబు కుటుంబం ఇంతలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేదు. సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నట్లు అక్రమ నిర్మాణం కూల్చివేయాలని వాదిస్తుంటే చంద్రబాబు మాత్రం తాను అక్కడే ఉంటానని మొండిపట్టు పట్టారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు వస్తుండటంతో చంద్రబాబు నివాసం చుట్టు పక్కల మొత్తం నీరుతో నిండిపోయింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ బాబుకు చెందిన కాన్వాయ్ హ్యాపీ రిసార్ట్స్ కు తరలించడం జరిగింది.

చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలసి హైదరాబాద్ వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు ఉంటున్న లింగమనేని అక్రమ నిర్మాణంలో కింద ఫ్లోర్ లో ఉన్న సామాను మొత్తం పై అంతస్తులోకి మారుస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లుతో శరవేగంగా పనులు చేయిస్తున్నారు. ఇక చంద్రబాబు ఇంటి చుట్టు నీరు రాకుండా ఇసుక బస్తాలను వేస్తున్నారు. దాదాపుగా పైనుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసారు. అక్రమం కాదు సక్రమం అని వాదించిన తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇప్పుడు ఎలాంటి వాదనకు తెరతీస్తారో చూడాలి

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి కరకట్టమీదకు చేరింది. దీంతో చంద్రబాబు నివాసంలోకి నీరు వెళ్లకుండా ఇసుక బస్తాలు ఏర్పాటు చేశారు. ఆయన వాహనాలను కూడా హ్యాపీ రిసార్టుకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్ గారు ముందు చెబితే విన్నారా.. సారీ మీది 40ఏళ్ల అనుభవం కదా? అరచేతిని అడ్డం పెట్టి సూర్య కాంతి ని, ఇసుక బస్తాలతో లక్షల క్యూసెక్ ల నీటి వరద ని ఆపలేరు..

ఏమయ్యా చంద్రం బాబూ..!! ధైర్యంగా నిలబడి వరద ఆపాలి కదా.. ఇలా పారిపోతావా?? పైగా ఇప్పటికె గ్రౌండ్ ఫ్లోర్ వి పైఫ్లోర్ కి తరలించారా!! అంటే గ్రౌండ్ ఫ్లోర్ మునుగుతుంది అన్న మాట.. మునిగితే, రేపు వచ్చి కూల గొట్టొచ్చు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *