చంద్రబాబు ఇలానే ఉండాలి… మారకూడదు… ఈసారి 10 కూడా రావు

ఈ రోజున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ఆలోచనా విధానం కూడా ఇలానే ఉండాలి.. ఏ మాత్రం మార్పు రాకూడదు…

గత 80 రోజులుగా నేను ఎందుకు ఓడిపోయాను… నన్ను ఇలా ఎందుకు ఓడించారు … నేను ఏమి తప్పు చేశాను అంటున్నారు…

నిశ్పక్షపాతంగా నా విశ్లేషణ @30 degrees …

బ్రమల్లో బతకడం ….

రైతు రుణమాఫీ నుండి ఆయన ఇచ్చిన కాపు reservations నుండి అన్నీ హామీలు నెరవేర్చా .. నా కన్నా తోపు ఎవడూ లేడు అనే బ్రమలో ఉన్నారు.

 • నిజానికి రైతుకు రుణమాఫీ జరిగిందా లేదా అనేది రైతుకు తెలుసు … ఆయన బాంక్ కి ఎంత అప్పు ఉన్నాడు. చంద్రబాబు ఎంత తీర్చారు , ఇంకా balance ఎంత కట్టాలి అనేది లెక్కలు ఆ particular రైతుకే తెలుసు.
 • పదే పదే 24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశా అని చెప్పిన చంద్రబాబు కి నిజానికి ఎంత చెల్లించారు అనేది తెలియదా ?
 • కాపు reservations మీద గొడవ అయింది కాబట్టి బయటకి వచ్చింది.
 • కానీ ST లలో జేరుస్తా అని రజకులకు, బోయలకు తదితర కులాలకు ఇచ్చిన హామీ ఏమైంది . వీరి వొట్ల సంఖ్య ఎంత ? ఈ సామాజిక వర్గాల వారు నివసించే booth ల వారీగా 2014 VS 2019 review చేశారా ?
 • ఇలా ఎన్నో బ్రమల్లో ఉన్నారు.
 • ఆబద్దాలు , మోసపు మాటలు .. మభ్య పెట్టడం
 • 1970 లలో చంద్రబాబు యూనివర్శిటీలలో చేసిన కుల రాజకీయాలు, ఆబద్దపు మాటలు, మోసాలు ఇప్పుడు చెల్లవు…
 • పులివెందుల లో నీరు ఇచ్చా అని చెబితే శ్రీకాకుళం జిల్లా వోటరు ఎందుకు మారతాడు ? పులివెందుల కి నీరు నిజంగా ఇస్తే అక్కడ ప్రజలకి తెలియదా ? ఎవరి హయాంలో అక్కడ పనులు జరిగాయా లేదా అనేది ?
 • మాట మాటికి Graphics లలో అంతర్జాతీయ నగరం చూపించి నిజానికి చిన్నపాటి వర్షానికి కారుతున్న సచివాలయం సాక్ష్యం ప్రజలకు తెలియదు అనుకున్నారా ? Whats up , facebook , Youtube లు లేవు కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రమే ఉన్నాయి అనుకున్నారా ?
 • నిందలు, అవహేళనలు …
 • ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగితే హుందాగా ఉండాల్సింది పోయి కోడి కత్తి అన్నారు… అనుభవం లేడు అని అవహేళన చేశారు… కానీ ప్రజలు అలా చూడలేదు.
 • మోడీ తో 4 ఏళ్ళు పాటు పగలు రాత్రి సంసారం చేసి ఎన్నికల నాటికి గోల చేసి నిందలు మోపారు. అవినీతి కాపాడుకోవడానికి CBI ని నిషేదించి తనమీద దాడి అని నిందలు వేశారు.

అసమర్దత ..

 • తుని రైలు తగలబడితే పులివెందుల మీద నెపం వేసి తన అసమర్దత చాటుకున్నారు.
 • red handed గా దొరికిన MLA లని వదిలేశారు. అరాచకాలా మీద ఫిర్యాదు చేసిన వారిని హింసించిన పట్టించుకోలేదు.
 • ఇలా ఎన్నో తప్పిదాలు … 23 మందితో పిరాయింపులు .. 4 కి మంత్రి పదవులు ఇచ్చి మళ్ళీ నేను నిప్పు అనే కధలు నమ్మడానికి ఇవి 1978 కాదు. 2019 …

ఇప్పటికీ అదే తీరు…

 • నిన్న GO ఇచ్చి ఆశా workers జీతాలు పెంచితే , paid artist లతో ఫోటో తీసి ఆ ప్రచారం చేయడం …. నిజానికి ఆశా workers జీతాలు పెంచారా లేదా అనే ఆలోచన లేదా వారి కోసం పాకులాడే వారు ఇప్పుడు లేరు. అది కేవలం ఆ 7000 మంది సమస్య . వారికి జీతం పెంచారా లేదా అనేది వారికి తెలుసు. ఏ రోజుల్లో GO copy లేదా ఆ సమాచారం కేవలం 10 నిమిషాల్లో ఆ సమస్య ఉన్నవారి అందరికీ వెళ్తుంది.
 • గతంలో అంటే ఒక 20 ఏళ్ల క్రితం ధర్నా అంటే ఒక 500 నుండి 1000 మంది వచ్చేవారు. కానీ ఈ రోజున ధర్నా అంటే రావడం లేడు. కారణం ఏ పనికి వెళ్ళినా రోజుకి 500 నుండి 1000 రూపాయల ఆదాయం వస్తుంది. ఎన్నికలలో చూసుకుందాంలే అని అనుకుంటున్నారు ప్రజలు.
 • గతంలో ధర్నా అంటే MLA స్థాయి నాయకుడు ఒక 20 kg ల ఉప్మా చేస్తే తినేసి కూర్చుని వెళ్లిపోయేవారు. డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ధర్నా అంటే లక్ష రూపాయల కర్చు వస్తుంది.
 • ఇవన్నీ reality .. ఇలా ప్రపంచం ఉండగా ఆయన చెప్పేది మాత్రమే వినే రోజు ఎప్పుడో పోయింది. ప్రజలు రెండో వైపు చూస్తున్నారు.
 • PPA ల మీద …. వితండవాదం
 • ఇలా ప్రతి ఒక్కటి ఆయన రాజకీయం 2019 లో కాకుండా 1980 లలోనే ఉండి పోయింది.
 • ఆయన ఆలోచనా విధానం మారకూడదు . ఆయన ఇలానే ఉండాలి. ఆయనకు సలహాలు ఇచ్చేవారు కూడా ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ …

Credits: శ్రీధర్ అవుతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *